- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పడవెళ్లి పోతుందిరా.. చాయా చెచ్చి బోటింగ్ సవాల్.!
కేరళలో పర్యాటకులను దినాం పలకరించే ఆత్మీయ స్నేహం ఆమె

దిశ, ఫీచర్స్: మన జీవితమే ఒక ప్రయాణం. ఆ ప్రయాణం ఆగిపోతే మనిషి మనుగడే ఉండదు. బతుకు ప్రయాణంలో ఒకొక్కరు ఒక్కో పని చేస్తుంటారు. కొందరు పైసల కోసం.. కొందరు సంస్కృతి పరిరక్షణ కోసం.. కొందరు అభిరుచి కోసం తమ తమ పనులు చేస్తుంటారు. అలాంట వారిలో కేరళ చాయా చెచ్చీ ఒకరు. కేరళలో పర్యాటకులను దినాం పలకరించే ఆత్మీయ స్నేహం ఆమె.
11 ఏళ్లుగా..
కుమరకోమ్ బ్యాక్‌వాటర్స్‌లో చిన్న చెక్క బోటుపై ప్రతిరోజూ దర్శనమిస్తోంది చాయా చెచ్చీ. ఆ బోటులో మసాలా చాయ్ అమ్ముతూ 11 ఏళ్లుగా స్థానికులను.. పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కుమరకోమ్ కొకనట్ లగూన్‌లో తన ఫ్లోటింగ్ టీ షాప్ కొన్నేళ్లుగా సాంస్కృతిక చిహ్నానికి ప్రతీకగా మారింది. తన నవ్వు.. ఆతిథ్యం.. స్నేహ బంధాలు కేరళ ఆతిథ్యానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. పర్యాటక అధికారులు కూడా చాయా చెచ్చీతో ఏళ్లతరబడి అనుబంధాన్ని ప్రత్యేక అనుభవంగా గుర్తిస్తున్నారు. స్థానిక సంస్కృతిని కాపాడుకుంటూ పర్యాటకాన్ని పెంచే ప్రయత్నంచేస్తున్న తనకు మ్దతునిస్తున్నారు.
ఆస్వాదింపజేసే అతిథిగా..
సాయంకాల వేళల్లో కొకనట్ లగూన్‌లో ఒక చిన్న చెక్క బోటులో నుంచి మసాలా చాయ్ ఘుమఘుమలు.. ఉడుకుడుకు స్నాక్స్ వాసన పర్యాటకులకు నోరూరిస్తోంది. చాయ్ తాగొద్దు అనుకునేవాళ్లను కూడా ఈ ఘుమఘుమలు కట్టిపడేసి తాగేలా చేస్తాయి. ఏమేస్తుందో ఈ చాయ్‌లో అనుకుంటారంతా. ఆమె ఏవి వేసినా అందరి ముందే వేస్తుంది. టీ ఆకులు.. మసాలాల మిశ్రమం మాత్రమే యాడ్ చేస్తుంది. రుచి అంత బాగుంటుంది కాబట్టే.. దీనినొక చాయ్‌గా కాకుండా.. కేరళ సంస్కృతిని ఆస్వాదింపజేసే అతిథిగా చెప్పుకుంటారు. చాయ్‌తో సుకియన్.. అరటి బజ్జీలు ఇస్తుంది చెచ్చీ.
పర్యాటకానికి ప్రత్యేక ఆకర్షణ..
చాయా చెచ్చీ అల్లంతదూరం నుంచి వస్తుందనగానే అందరూ ఒడ్డున నిలబడి తన కోసం ఎదురుచూస్తుంటారు. ఆమె ఒక కప్పు చాయ్‌తో ఎన్నో కథలు పంచుకుంటారు. తన నవ్వు.. స్నేహం ప్రతీ క్షణాన్ని జ్ఞాపకంగా మారుస్తాయి. పర్యాటక అధికారులు కూడా చాయా చెచ్చి షాప్‌ను ప్రత్యేక ఆకర్షణగా గుర్తిస్తున్నారు. తన వల్ల కూడా పర్యాటక రద్దీ పెరుగుతుందని వాళ్లు నమ్ముతున్నారు. పనిపట్ల.. పర్యాటకం పట్ల తన అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు. చెచ్చీ ఒక సాధారణ మహిళ కాదు.. ఆమె కేరళ పర్యాటకానికి ప్రత్యేక ఆకర్షణ అని కొనియాడుతున్నారు.
పరిరక్షణ అంబాసిడర్..
ఆమె చేస్తున్నది సాధారణ పనేం కాదు. మగవాళ్లు కూడా ఈ రిస్క్ తీసుకోవడానికి భయపడుతుంటారు. మొదట్లో తను ఊర్లో చాయ్ బండీ పెట్టింది. అది పెద్దగా నడవలేదు. ఆ తర్వాతే బ్యాక్‌వాటర్స్‌లో ఫ్లోటింగ్ షాప్ ప్రారంభించి ఉపాధికి మార్గాన్ని సృష్టించుకుంది. నీళ్లమీద దినాం ప్రయాణమంటే అంత ఈజీయేం కాదు. తరుచూ వర్షాలొస్తుంటాయి. కొన్నిసార్లు పర్యాటకులు అంతగా రారు. వాళ్లను తీసుకెళ్లడం కూడా కష్టమే అవుతుంది. టీకొట్టుదేముంది అనుకొని లైట్ తీసుకునేవాళ్లొకసారి చాయా చెచ్చీ గురించి తెలుసుకోండి. ఇవాళ తన ఆర్థిక స్వావలంబనకు.. సాంస్కృతిక పరిరక్షణకొక అంబాసిడర్ లాంటిది.






