- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థోనీ హెలికాప్టర్ షాట్ తెలుసు.. హెలికాప్టర్ భేల్‌పురీ తెలుసా? ఇదిగో.. (వీడియో)
ఈ వ్యక్తి కూడా 'హెలికాప్టర్' స్టేల్‌ని అందిపుచ్చుకున్నాడు. Hilarious Way Of Making Helicopter Bhelpuri.

దిశ, వెబ్‌డెస్క్ః క్రికెట్‌లో హెలికాప్టర్ షాట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. థనాథన్ థోనీ పరిచయమున్నవారికి ఆ షాట్ కూడా తెలిసే ఉంటుంది. అయితే, ఇక్కడ భేల్‌పురీ అమ్ముతున్న ఓ వ్యక్తి కూడా థోనీ షాట్‌కు ఏ మాత్రం తగ్గకుండా హెలికాప్టర్ భేల్‌పురీని తయారుచేస్తున్నాడు. స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు చాలా మంది రకరకాల స్కిల్స్ చూపించినట్లే, కస్టమర్‌లను ఆకర్షించడానికి ఈ వ్యక్తి కూడా 'హెలికాప్టర్' స్టేల్‌ని అందిపుచ్చుకున్నాడు. హెలికాప్టర్ భెల్ తయారు చేసే ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ మీమ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియోలో పఫ్డ్ రైస్, ఉల్లిపాయలు, కొత్తిమీర, పూరీ, చట్నీ, బంగాళదుంపలు, మసాలాతో తయారుచేసే భేల్ పాత్రను వంచి, ఒక పెద్ద చెంచా తీసుకొని, తన చేతికి అత్యంత వేగంతో బలంతో భేల్‌ను తిప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కావాలంటే మీరూ చూడండి..!






