వేశ్యలను పెళ్లి చేసుకుంటే జైలు నుంచి విడుదల.. ఖైదీలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం

by Sujitha Rachapalli |   ( Updated:2025-04-16 14:35:38.0  )
వేశ్యలను పెళ్లి చేసుకుంటే జైలు నుంచి విడుదల.. ఖైదీలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, ఫీచర్స్ : నేరం చేసి జైలుకు వెళ్లిన ఖైదీలు శిక్ష పూర్తి కాకముందే బయటకు రావాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ కారణం అయితే ఓకే కానీ వేశ్యను పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ ఇచ్చేసింది ఫ్రెంచ్ ప్రభుత్వం. అవును ఒకప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అయింది. ఖైదీలకు స్వేచ్ఛను ప్రసాదించేందుకు ప్రాస్టిట్యూట్స్‌ను వివాహం చేసుకోవాలనే నిబంధన విధించింది. పెళ్లి చేసుకున్నాక అక్కడి నుంచి ఓ ప్రాంతానికి తరలివెళ్లాలనే రూల్ పెట్టింది. ఎందుకు? ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ డిటెయిల్స్ చూద్దాం.

1719లో ఫ్రెంచ్ ప్రభుత్వం లూసియానా కాలనీలో జనాభాను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పారిస్‌లోని ఖైదీలకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వివాహం చేసుకుని లూసియానాకు వలస వెళ్లాలని షరతు విధించింది. లూసియానా అనే ప్రాంతం గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి ఆధునిక కెనడా వరకు విస్తరించిన ఫ్రెంచ్ కాలనీ. 1699లో స్థాపించబడిన ఈ కాలనీ 18వ శతాబ్దం ప్రారంభంలో భారీ సవాళ్లను ఎదుర్కొంది. లూయిస్ XIV మరణం తర్వాత (1715) ఫిలిప్ II, డ్యూక్ ఆఫ్ ఓర్లీన్స్ రీజెన్సీ కింద ఫ్రెంచ్ క్రౌన్ ఈ కాలనీని లాభదాయకంగా.. బ్రిటిష్, స్పానిష్ కాలనీ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ లూసియానా వాతావరణం, వ్యాధులు (మలేరియా, యెల్లో ఫీవర్ వంటివి), స్థానిక అమెరికన్ తెగలతో ఘర్షణలు సెటిలర్లను నిరుత్సాహపరిచాయి. 1717 నాటికి కాలనీలో 700 మంది ఫ్రెంచ్ సెటిలర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో సైనికులు, పరిపాలనాధికారులు ఎక్కువ.

జాన్ లా యొక్క కంపెనీ ఆఫ్ ది వెస్ట్ (తర్వాత కంపెనీ ఆఫ్ ది ఇండీస్) నియంత్రణలో ఉన్న కాలనీ.. ఆర్థిక అస్థిరత, దుర్వినియోగంతో సతమతమైంది. లింగ అసమతుల్యత కూడా కనిపించింది. కాలనీలో మహిళల కొరత ఉండటం వల్ల కుటుంబ నిర్మాణం, దీర్ఘకాలిక స్థిరనివాసం కష్టమైంది. చాలా మంది మొదటి సెటిలర్లు సాహసికులు, సైనికులు, లేదా ఒప్పంద దాసులైన పురుషులు మాత్రమే. కాగా ఈ సమస్యలను పరిష్కరించడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం బలవంతపు వలస, ప్రోత్సాహక కాలనీకరణ పథకాలు చేపట్టింది. ఇందులో భాగమే వేశ్యలతో పెళ్లికి ఒప్పుకుని వలస వెళ్తే ఖైదీలకు స్వేచ్ఛ ఇవ్వబడుతుందనే ఆఫర్ కూడా. ఈ ఖైదీలు కూడా సాధారణంగా చిన్న నేరాలకు (దొంగతనం, భిక్షాటన, స్మగ్లింగ్) పాల్పడినవారు, రాజకీయ ఖైదీలుగా శిక్షించబడినవారు.

ఫ్రీడమ్ ఆఫర్‌లో భాగంగా వారు లూసియానా కాలనీలో శాశ్వతంగా స్థిరపడి.. వ్యవసాయం, ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలి.


Also Read..

నాకు సెక్స్ అంటే ప్రాణం.. కనీసం 26 నిముషాలైనా ఉండాలి.. కానీ మా ఆవిడ 2 లేక 3 నిముషాలకే..



Next Story

Most Viewed