Health : చలికాలంలో లోయర్ బ్యాక్ పెయిన్.. సమస్య కండరాల్లో లేకపోవచ్చు!

by Javid Pasha |   (  Updated:2025-11-07 14:22:57  IST  )

శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉన్నవారిలో 60% వరకు మస్క్యులో స్కెలెటల్ పెయిన్ (Musculoskeletal pain) వచ్చే అవకాశం ఉంటుంది.

Health : చలికాలంలో లోయర్ బ్యాక్ పెయిన్.. సమస్య కండరాల్లో లేకపోవచ్చు!
X

దిశ, ఫీచర్స్ : మిగతా సీజన్లకంటే కండరాల నొప్పి, నడుము నొప్పి వంటివి చలికాలంలో కాస్త ఎక్కువగా వేధిస్తుంటాయి. అయితే చాలా మంది నడుము కింది భాగంలో తలెత్తే నొప్పిని(lower back pain) కూడా కండరాల నొప్పిగా భావిస్తుంటారు. కానీ వాస్తవం అది కాదంటున్నారు నిపుణులు. లోయర్ బ్యాక్ పెయిన్‌తో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే సమస్య కండరాల్లో లేకపోవచ్చు. చలికాలంలో ఇది ఎక్కువగా విటమిన్ డి లోపంవల్ల తలెత్తుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ డి (Vitamin D) కేవలం ఎముకలకు మాత్రమే కాదు, ఈ శక్తివంతమైన పోషకం కండరాల బలానికి, అలాగే నొప్పి లేదా మంట నియంత్రణలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే శరీరంలో ఇది తగ్గినప్పుడు దాని ప్రభావం నడుము కింది భాగంపై, వెన్నెముక ఉన్న కండరాలపై ఎక్కువగా ఉంటుంది. అంటే.. ఈ భాగాల్లో నొప్పి సంభవిస్తుంది. అందుకే లోయర్ బ్యాక్ పెయిన్ తరచుగా వేధిస్తుంటే.. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య అధికంగా ఉంటే, మీ శరీరానికి విటమిన్ డి అవసరం కావచ్చు. కాబట్టి అసలు కారణమేమిటో తెలుసుకోవడానికి వైద్య నిపుణులను సంప్రదించాలి. ఒకవేళ విటమిన్ డి లోపమే ప్రధాన కారణం అయితే వైద్యుల సలహా పాటించాలి. ఉదయంపూట ఎండలో కాసేపు గడపడంవల్ల విటమిన్ డిని సహజంగానే పొందవచ్చు.

వైద్య నిపుణుల ప్రకారం.. శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉన్నవారిలో 60% వరకు మస్క్యులో స్కెలెటల్ పెయిన్ (Musculoskeletal pain) వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బాధితుల్లో వెనుకవైపు నడుము కింది భాగంలో నొప్పి మొదలవుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే.. సూర్యకాంతి, లేదా స్మార్ట్ సిప్లమెంటేషన్ ద్వారా విటమిన్ డి స్థాయిలను పెంచుకోగలిగితే కండరాల బలపడతాయి. శరీరంలో వాపు, మంట, వెన్నెముక నొప్పి, కటి నొప్పి, కండరాల నొప్పి, నడము నొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతాయి. అందుకోసం రోజూ కాసేపు ఉదయంపూట ఎండలో గడిపితే చాలు. ఇక ఆహారాల విషయానికి వస్తే సాల్మన్, మాకరెల్, ట్యూనా వంటి కొవ్వు చేపలు, గుడ్డులోని పచ్చ సొన, పాలు, మష్రూమ్స్, కోడి లేదా గొర్రె మాసంలోని లివర్ తీసుకోవడంవల్ల కూడా శరీరానికి విటమిన్ డి అందుతుంది. Link

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఇది వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story