- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చదివింది గుర్తుండాలంటే ఇలా చేయండి..!
మానవ మేధస్సులో కొన్ని లక్షలకొద్దీ పదాలతో కూడిన సమాచారం దాగి ఉంటుంది.

దిశ, ఫీచర్స్: మానవ మేధస్సులో కొన్ని లక్షలకొద్దీ పదాలతో కూడిన సమాచారం దాగి ఉంటుంది. అయితే, దాన్ని చాలామంది కావలసిన రూపంలో బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఏ రోజు పాఠం ఆ రోజే చదువుకుంటే విద్యార్థులు పరీక్షలను ఎలాంటి భయం లేకుండా రాయగలుగుతారు. మరికొందరు ఎంత చదివినా సరే పరీక్షల సమయానికి మరిచిపోతుంటారు. దీంతో వారు నిరాశకు గురవుతుంటారు. అందుకే పునశ్చరణ అనేది చాలా అవసరం. అంటే పాఠం విన్న తరువాత కానీ, చదివిన తరువాత కానీ దాన్ని మైండ్‌లో రిపీట్ చేస్తుండాలి. ఇలా చేయడం ద్వారా చదివినది బాగా గుర్తుంటుంది.
అయితే, చదువుతున్న సమయంలో 10 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవడం వల్ల మెదడు పనితీరుపై ఒత్తిడి పడకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి చదివిన తరువాత కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోవడం వల్ల మెదడులోని న్యూరాన్‌లు చురుగ్గా పనిచేస్తాయి. దీని వల్ల చదివింది ఈజీగా గుర్తుండిపోతుంది. మీకు తెలిసిన లేదా నేర్చుకున్న విషయాలను ఇతరులతో చర్చించడం వల్ల మెదడులో ఆ అంశం గుర్తుంటుంది. చదువుకునే వారికి మైండ్ మ్యాపింగ్ అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని అలవాటు చేసుకోవడం వల్ల ప్రతీ విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుంది.
ఒక అంశాన్ని నిర్ణీత సమయంలో నేర్చుకోవాలనే కచ్చితమైన నిబంధనను పెట్టుకోవాలి. ఆ సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించడకుండా దానిపైనే దృష్టి సారించాలి. ఒకేసారి ఎక్కువ అంశాలను ఎప్పుడూ చదవకూడదు. ఇలా చేయడం వల్ల చదివిన విషయం త్వరగా మరిచిపోతారు. ప్రశాంతమైన వాతావరణంలో ఏకాగ్రతతో చదివింది రిపీట్ చేసుకుంటుంటే త్వరగా మర్చిపోలేరు. మెదడు చురుగ్గా పనిచేయాలంటే అప్పుడప్పుడూ క్రాస్‌వర్డ్స్, కొత్త భాష, పజిల్స్ వంటివి చేస్తుండాలి. దీని వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది.
పాఠం చదువుతున్న సమయంలో దానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్‌ను నోట్స్‌లో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పరీక్షల సమయంలో వేగంగా రివిజిన్ చేయవచ్చు. సాధారణంగా చదువుతున్న సమయంలో దాహం వేస్తుంటుంది. దాహంగా ఉన్నా, అలాగే చదువుతుంటే ఏకాగ్రత ఉండదు. అందుకే చదువుతున్న సమయంలో నీళ్ల బాటిల్‌ని పక్కన పెట్టుకోవాలి. చదివిన విషయాన్ని పదే పదే రాయడం అలవాటు చేసుకోవాలి. ప్రతీ రోజు వ్యాయామం చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.






