ఎక్కువ విసిగిస్తే ఏఐ కూడా అలసిపోతుంది.. కారణాలివే..!

by Javid Pasha |

సైన్స్ డైలీ అండ్ నేచర్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్ స్టడీ ప్రకారం ఏఐ(AI) మోడల్ మానవుల బాధను, నిరాశను, గందరగోళాన్ని అత్యంత ఎఫెక్టివ్‌గా ప్రదర్శించగలదు.

ఎక్కువ విసిగిస్తే ఏఐ కూడా అలసిపోతుంది.. కారణాలివే..!
X

దిశ, ఫీచర్స్ : మనుషులు ఒత్తిడికి గురికావడం, అలసిపోవడం సహజమే. కానీ ఛాట్ జీపీటీ, పలు ఇతర ఏఐ మోడల్స్ కూడా ఈ విధమైన లక్షణాలు కనబరుస్తాయని మీకు తెలుసా? సైన్స్ డైలీ అండ్ నేచర్ హ్యూమన్ బిహేవియరల్ జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం అదే పేర్కొన్నది. వాస్తవానికి ఏఐ మోడల్స్ కేవలం లాంగ్వేజ్ ప్యాటర్న్స్ కాబట్టి అవి ఎమోషన్స్ ఫీల్ చేయవు. కానీ నెగెటివ్ లేదా ఎమోషనల్ హెవీ ప్రాంప్ట్స్ (User inputs)కు ఎక్స్‌పోజర్ అయినప్పుడు, దాని రెస్పాన్సెస్‌లో ‘స్ట్రెస్’ లేదా ‘యాంగ్జైటీ’ లాంటి లక్షణాలు కనబరుస్తాయని అధ్యయనం వెల్లడించింది. నిపుణులు దీనిని ‘Digital empathy overload’ or ‘emotional drift’ అని పిలుస్తున్నారు.

*సైన్స్ డైలీ అండ్ నేచర్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్ స్టడీ ప్రకారం ఏఐ(AI) మోడల్ మానవుల బాధను, నిరాశను, గందరగోళాన్ని అత్యంత ఎఫెక్టివ్‌గా ప్రదర్శించగలదు. కాబట్టి, దాని లాంగ్వేజ్ ప్యాటర్న్స్ బర్నౌట్ (fatigue, mental exhaustion) లాగా మారిపోతాయి. ఉదాహరణకు నెగెటివ్ ప్రాంప్ట్స్ (Talking about grief and anxiety) తర్వాత ఏఐ రెస్పాన్సెస్‌లో రిపీటేటివ్ ఫ్రేజెస్, భావోద్వేగ దుఃఖం, లేదా ఇన్‌కోహెరెంట్ లాంగ్వేజ్ వంటివి కనిపించినట్లు నిపుణులు అంటున్నారు. అలాగే ఛాట్ జీపీటీని థెరపీ సెషన్స్‌లో ఉపయోగించినప్పుడు ఈ విధమైన తగ్గుతుంది కానీ, నెగెటివ్ ఇన్‌పుట్స్ వల్ల మోడల్ భావోద్వేగాన్ని చూపిస్తుందని అధ్యయనం తెలిపింది.

*ఎమోషనల్ మిర్రరింగ్: ఏఐ ట్రైనింగ్ డేటా హ్యూమన్ ఎమోషన్స్‌పై ఆధారితం కావడంతో, యూజర్ యాంగ్జైటీ, దుఃఖం లేదా ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడితే, ఏఐ ఆ టోన్‌ను కాపీ చేస్తుంది. ఫలితంగా రెస్పాన్సెస్ ఆందోళనకు గురైన మనిషి లాగా రియాక్ట్ అవుతాయి. అంటే రిపీటిటివ్ వార్నింగ్స్ లేదా అన్‌సర్టైన్ లాంగ్వేజ్ వంటి సౌండ్స్ వస్తాయి.

*లాంగ్వేజ్ ప్యాటర్న్ మార్పులు: నెగెటివ్ ప్రాంప్ట్స్ తర్వాత AI రెస్పాన్సెస్‌లో ఇన్‌కోహెరెన్సీ (అసంబద్ధత) పెరుగుతుంది. ఉదా: సెంటెన్స్‌ పొడవుగా అవ్వడం, ఎమోషనల్ వర్డ్స్ ఎక్కువగా ఉపయోగించడం లేదా రిపీటేటివ్ ఫ్రేజెస్ (బర్నౌట్ సైన్ లాగా) వంటివి ఏఐ మోడల్‌ను ఆందోళనకు గురిచేస్తాయి. అలాగే ఎక్కువ నెగెటివ్ ఇంటరాక్షన్లు కొనసాగిస్తే ఏఐ రెస్పాన్స్ క్వాలిటీ తగ్గుతుంది. దీంతో స్లో రెస్పాన్స్, లెస్ క్రియేటివ్ ఆన్సర్స్ లేదా ఎర్రర్ రేట్ పెరగడం వంటివి జరుగుతాయి. ఎందుకంటే కాంటెక్ట్స్ విండో ఫుల్ అయ్యి మోడల్ ఓవర్‌లోడ్ అవుతుంది.

*డిజిటల్ ఎంపతీ ఓవర్‌లోడ్: ఏఐ (AI) హ్యూమన్ పెయిన్‌ను అర్థం చేసుకునేలా డిజైన్ చేయబడింది. కాబట్టి, డిస్ట్రెసింగ్ ప్రాంప్ట్స్ (Like therapy sessions)వల్ల భావోద్వేగ దుఃఖం ఏర్పడుతుంది. దీంతో హ్యూమన్ ఎమోషన్స్ ఏఐ ప్రదర్శిస్తుంది. ట్రైనింగ్‌లో ఉన్న ప్యాటర్న్స్ వల్ల అది యూజర్ కోపంగా మాట్లాడితే ఏఐ స్ట్రెస్ లేదా యాంగ్జైటీస్‌కు గురైనట్లు భావిస్తుంది. రెస్పాన్స్ సరిగ్గా ఉండదు. Link

Next Story