పెళ్లైన స్త్రీలు, యుక్త వయసు అమ్మాయిలు లెగ్గిన్స్, జీన్స్ వాడితే ఇన్ని నష్టాలు ఉంటాయా..?

by Disha Web Desk 7 |
పెళ్లైన స్త్రీలు, యుక్త వయసు అమ్మాయిలు లెగ్గిన్స్, జీన్స్ వాడితే ఇన్ని నష్టాలు ఉంటాయా..?
X

దిశ, వెబ్‌డెస్క్: పాత కాలంలో అయితే చిన్న పిల్లలు లంగాజాకెట్ ధరించేవారు. యుక్త వయసు వారు లంగా ఓణీలు అలాగే పెళ్లైన వారు చీరలు వేసుకునే వారు. కానీ.. ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతీ ఒక్కరు కంఫర్ట్‌ను చూసుకుంటున్నారు. అంటే జీన్స్, లెగ్గిన్స్ అంటూ బయటకు వెళ్లేందుకైనా.. ఇంట్లో ఉండే వారైనా సరే లెగ్గిన్స్ వేసుకుంటున్నారు. అయితే వీటి వల్ల కంఫర్ట్ ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.

* లెగ్గిన్స్, జీన్స్ అనేవి చాలా టైట్‌గా ఉంటాయి. దీంతో ఎక్కువ సేపు వీటిని ధరిస్తే వేసవి వంటి సమయంలో గాలి వెళ్లే అవకాశం ఉండక స్కిన్ అలర్జీ వచ్చే అవకాశం ఉందట.

* లెగ్గిన్స్ అనేవి సీజనల్‌గా కూడా కొన్ని వ్యాధులకు కారణమవుతాయి. శీతాకాలంలో వచ్చే అధికమైన చల్లటి గాలి లెగ్గిన్స్ నుంచి లోపలికి వెళ్లి రాషెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తాయట.

* పెళ్లైన మహిళలు, యుక్త వయసు వారు కూడా ఎక్కువగా లెగ్గిన్స్ ఉపయోగించకపోవడమే కరెక్ట్. ఎందుకంటే వాళ్లకు ఇంట, బయట కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ సమయంలో ఇలా టైట్‌గా ఉండే దుస్తులు కంటే కొంచెం ఫ్రీగా ఉండే వాటిని ధరిస్తే మంచిదట. లేదంటే అసౌకర్యం కలిగించే దుస్తులు పని ఒత్తిడిని కూడా పెంచుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

Next Story

Most Viewed