- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone లో నంబర్స్ పై నుండి కిందకి ఉంటే..! calculator , Computer లో కింద నుండి పైకి ఉంటాయి.. ఎందుకో తెలుసా..?
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా scientific calculator తో పరీక్షలు రాశారు.

దిశ, వెబ్ డెస్క్ : మనం చేయాల్సిన చాలా పనులన్నింటిని కంప్యూటర్ ను ఉపయోగించి చేస్తుంటాము. ఇది , ఎప్పటినుంచో కొనసాగుతుంది. అలాగే, మొబైల్ ఫోన్ ని కూడా బాగా వాడేస్తుంటాము. ఎందుకంటే, ప్రస్తుతం టెక్నాలజీ కాలం నడుస్తుంది కాబట్టి..! అలాగే, మనం చిన్నప్పుడు calculations చేయడానికి calculator ని వాడే వాళ్ళము. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా scientific calculator తో పరీక్షలు రాశారు. ఫోన్, calculator , కంప్యూటర్ కీ బోర్డు లో ఉండే నంబర్స్ ఒకసారి చూడండి.
ఫోన్ లో నంబర్స్ ఒకసారి గమనిస్తే.. పై నుండి కిందకి ఉంటాయి. కానీ calculator , కంప్యూటర్ కీ బోర్డు లో కింద నుండి పైకి ఉండటం మీరు చూసే ఉంటారు. అసలు, అలా ఎందుకున్నాయో ఎవరికీ తెలియదు. ఇది తెలుసుకోవాలంటే.. calculator రాకముందు కాలానికి వెళ్ళాలి. పాత కాలంలో మెకానికల్ కాష్ రిజిస్టర్ లను వాడేవాళ్ళు. దానిలో 0 కింద ఉంటే… మిగతా నంబర్స్ 1 , 2 , 3 .. అలా పైకి ఉండేవి. ఎందుకంటే.. సున్నా సంఖ్యను ఎక్కువగా ఉపయోగించేవారు. పనిని సులభంగా చేయడానికి అలా డిజైన్ చేసారు. ఆ తర్వాత, మెకానికల్ calculator తయారు చేసినప్పుడు కూడా 0 కింద పెట్టి 9 పైన పెట్టారు.
కొంత కాలం తర్వాత ఎలక్ట్రానిక్ calculator కనిపెట్టారు. అయితే, దీనిలో కూడా మెకానికల్ calculator పద్ధతినే ఫాలో అయ్యారు. అదే pattern నే ఈ కాలంలో కూడా వాడుతున్నారు. మరి calculator లాగానే ఫోన్ కి ఎందుకు ఫాలో అవ్వలేదనే సందేహం వచ్చే ఉంటుంది. అప్పట్లో రొటేటింగ్ డయల్ ఉండే ఫోన్స్ ఉండేవి.. దానిలో 1 – 9 వరకు హోల్స్ ఉండేవి. తర్వాత 0 ఉండేది. ఏ నెంబర్ డయల్ చేయాలన్నా ఆ నెంబర్ దగ్గర వేలుతో చివరి వరకు తిప్పాలి.
ఇక 1960 లో టెలిఫోన్ కీప్యాడ్ మొత్తం మార్చేశారు. అప్పుడు రొటేటింగ్ ది తీసేసి.. ప్రెస్ చేసే బటన్స్ పెట్టారు. కొత్త కొత్త pattern లు పెట్టి ఉపయోగించి, జనాల అభిప్రాయాలను తీసుకొని నంబర్స్ పై నుండి కిందికి ఉంటేనే మనుషులు ఇష్ట పడుతున్నారని అర్థం చేసుకుని 3 * 3 pattern పైనుండి కిందకి నంబర్స్ ఫోన్ పాడ్ చేశారు.






