It's amazing : ప్రపంచంలోనే దోమలు లేని ఏకైక దేశం ఇదే.. కారణం ఏంటంటే..

by Javid Pasha |

It's amazing : ప్రపంచంలోనే దోమలు లేని ఏకైక దేశం ఇదే.. కారణం ఏంటంటే..

Its amazing : ప్రపంచంలోనే దోమలు లేని ఏకైక దేశం ఇదే.. కారణం ఏంటంటే..
X

దిశ, ఫీచర్స్ : దోమలు.. ఈ పేరు వింటేనే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు గుర్తొకొస్తాయి. ఎందుకంటే వీటి వ్యాప్తికి ప్రధాన కారణం ఇవే. చూడ్డానికి చిన్నగా ఉండే ఈ పరాన్న జీవి కాటువల్ల ప్రతీ ఏటా ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కాబట్టి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రపంచంలోనే దోమల బెడద అసలుకే లేని దేశం ఒకటుందని మీకు తెలుసా? అదే ఐస్‌‌లాండ్ !

ఐస్‌లాండ్ (Iceland) నిజానికిది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ద్వీప దేశం. ‘The Republic of Iceland’ అనేది అధికారిక పేరు. ఓవైపు మంచు పర్వతాలు, మరోవైపు అగ్ని పర్వతాలు, అందమైన ప్రకృతి వనరులతో సురక్షితమైన దేశంగా ప్రసిద్ధి చెందిన ఈ దేశానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే.. ప్రపంచంలోనే దోమలు ఏకైక దేశం ఇదే. అక్కడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులే ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు.

ఎందుకు ఉండవంటే..

ఐస్‌లాండ్‌లో దోమలు లేకపోవడానికి ప్రధాన కారణం అక్కడి వాతావరణం. ముఖ్యంగా వేగంగా కడ్డగట్టే - కరిగే (freeze-thaw)వెదర్ సైకిల్. ఈపరిస్థితులు దోమల మనుగడకు ఆటంకంగా మారుతాయి. వాస్తవానికి దోమల జీవన చక్రం గుడ్డు, లార్వా, ప్యూపా, వయోజనదశ వంటి పరిణామాలకు స్థిరమైన వాతావరణం అవసరం. కానీ ఐస్‌ లాండ్‌లో అలాంటి వెదర్ ఉండదు. ఉష్ణోగ్రతలు తరచుగా ఆకస్మికంగా మారుతూ ఉంటాయి. దీంతో దోమలు గుడ్లు, లార్వాలు మనుగడ సాగించలేవు.

చల్లని, అస్థిర వాతావరణం

ఐస్‌లాండ్‌లో వేసవి కాలం చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ సమయంలోనూ వెదర్ చల్లగానే ఉంటుంది. దోమలు మనగడ సాగించాలంటే సాధారణంగా 20°C పైన ఉష్ణోగ్రతలు అవసరం. కానీ ఐస్‌లాండ్‌లో సాధారణ ఉష్ణోగ్రతలే 10-15°C మధ్య నమోదవుతుంటాయి. దీంతో దోమలు బతకలేవు. ఇక శీతాలకాంలో అయితే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతుంటాయి. కాబట్టి ఇవి దోమల జీవన చక్రాన్ని పూర్తిగా అడ్డుకుంటాయి.

సముద్ర వాతావరణం

మరొక కారణం ఏంటంటే.. ఐస్‌లాండ్ ఒక ద్వీప దేశం. కాబట్టి దాని సముద్ర వాతావరణం వల్ల తేమ, గాలులు అధికంగా ఉంటాయి. ఈ గాలులు దోమలు స్థిరంగా ఎగరడాన్ని కష్టతరం చేస్తాయి. కాబట్టి దోమలు బతకలేవు. పైగా ఈ దేశంలో నీటివనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇవి హిమానీ నదాల నుంచి ఉద్భవిస్తాయి. కాబట్టి చల్లగా, ఆక్సిజన్‌తో నిండి ఉంటాయి. ఈ విధమైన నీటి లక్షణాల్లో దోమల లార్వాలు జీవించలేవు. ఎందుకంటే అవి స్థిరమైన, వెచ్చటి నీటిని ఇష్టపడతాయి. సమీప దేశాలైన గ్రీన్ లాండ్, నార్వేలో దోమలు ఉన్నప్పటికీ అవి ఐస్‌లాండ్‌లోకి వలసవచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడి వాతావరణంలో అవి బతకలేవు.

Next Story