- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబ్రెల్లా 2.0.. యూట్యూబర్ సరికొత్త ఆవిష్కరణ!
ప్రముఖ యూట్యూబర్ జాన్.. మరో సరికొత్త ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్ తయారు చేశాడు. ఫ్లయింగ్ అంబ్రెల్లా2.Oను ఆవిష్కరించాడు.

దిశ, ఫీచర్స్: ప్రముఖ యూట్యూబర్ జాన్.. మరో సరికొత్త ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్ తయారు చేశాడు. కెనడాకు చెందిన ఈ యువకుడు.. చేతితో పట్టుకోకుండానే మనల్ని అనుసరిస్తూ వాన, ఎండ నుంచి రక్షణ కల్పించే ఫ్లయింగ్ అంబ్రెల్లా2.Oను ఆవిష్కరించాడు. ఇది కంప్లీట్ హ్యాండ్స్ ఫ్రీ పవర్డ్ గొడుగు. డ్రోన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. జీపీఎస్ సాయంతో మనవెంటే ఉండే ఈ గొడుగును మోబైల్ యాప్‌తో కంట్రోల్ చేయవచ్చు. ఒక సంవత్సరంపాటు కష్టపడి అప్ గ్రేడ్ చేసిన ఈ వెర్షన్ రిమోట్ కంట్రోల్‌పై ఆధారపడి నడుస్తుంది. డ్రోన్ మోటార్లు, అడ్వన్స్‌డ్ స్టెబిలైజేషన్ సిస్టమ్స్, 3D-ప్రింటెడ్ పార్ట్స్‌ను వినియోగించి తయారు చేసిన ఈ అంబ్రెల్లాలో ఫోర్టబుల్ కార్బన్-ఫైబర్ నైలన్ హ్యండ్స్ ఉన్నాయి. ఇవి అవసరం ఉన్నప్పుడే తెరుచుకుని ఆ తర్వాత గొడుగులోపలే చిన్న బ్యాక్ ప్యాక్‌లా అటోమెటిక్‌గా ముడుచుకుని సెక్యూర్‌గా లాక్ చేసుకుంటాయి.
ఈ హ్యాండ్స్ ఫ్రీ అంబ్రెల్లా వాడటం వల్ల మనం నడుచుకుంటూ మొబైల్ యూజ్ చేయొచ్చు. లేదా నడుస్తూ చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. ఈ డ్రోన్ తరహా గొడుగుతో భారీ వర్షంలోనూ మనకు అవసరమైన కిరాణ సరుకులు లేదా ఇతర ప్రొడక్ట్స్‌ను నేరుగా స్టోర్ నుంచి ఇంటికి తెప్పించుకోవచ్చు. అంతేకాదు ఒక వస్తువును రిసీవ్ చేసుకున్న తర్వాత ఎంత సమయంలో గమ్యాన్ని చేరుకుంటుందో కూడా పక్కగా చేప్పేస్తుందట. ఈ గొడుగు కింద ఉన్న వ్యక్తి చేరుకోవాల్సి ప్లేస్ రీచ్ టైమ్ కూడా చూపిస్తుంది. ఇందులో ఉండే కెమెరా, సెన్సార్ల సాయంతో అప్పటికప్పుడు నిర్దేశించిన ప్లేస్‌కు యజమానితోపాటు చేరుకుంటుంది.
ఈ అంబ్రెల్లా 2.O తయారీ ప్రక్రియ అనుకున్నంత సజావుగా సాగలేదని జాన్ వెల్లడించాడు. డెవలప్ చేస్తున్న సమయంలో అనేకసార్లు ఫేయిల్ అయినట్లు తెలిపాడు. అంతా సెట్ అయిందనుకునే సమయానికి ఏదో ఒక ఆటంకం ఏర్పడిందని, ఒక దశలో పూర్తిగా ధ్వంసం చేయాలని ఫిక్స్ అయ్యానని చెప్పాడు. కానీ గొడుగుకు అమర్చిన కెమెరాలే తనను లక్ష్యంవైపు ఎంకరేజ్ చేశాయన్నాడు. అనేక సమస్యల కారణంగా ఈ గొడుకు ఆవిష్కరణ ఆలస్యమైనా.. చివరికి సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు జాన్. యూట్యూబ్‌లో లక్షా యాభైవేల సబ్‌స్ట్ర్కైబర్లను కలిగివున్న జాన్.. ఇప్పటివరకు Self Landing Satellite, MIT Maker Portfolio, Remote control Airplane వంటి మూడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను తయారుచేశారు.






