Health : సూది గుచ్చకుండానే రక్త పరీక్షలు..! దేశంలోనే తొలిసారిగా AI ఆధారిత బ్లడ్‌టెస్ట్ టూల్‌ను ప్రవేశపెట్టిన నీలోఫర్ హాస్సిటల్

by Javid Pasha |   (  Updated:2025-05-23 06:35:31  IST  )

Health : సూది గుచ్చకుండానే రక్త పరీక్షలు.. దేశంలోనే తొలిసారిగా AI ఆధారిత బ్లడ్‌టెస్ట్ టూల్‌ను ప్రవేశపెట్టిన నీలోఫర్ హాస్సిటల్

Health : సూది గుచ్చకుండానే రక్త పరీక్షలు..! దేశంలోనే తొలిసారిగా AI ఆధారిత బ్లడ్‌టెస్ట్ టూల్‌ను ప్రవేశపెట్టిన నీలోఫర్ హాస్సిటల్
X

దిశ, ఫీచర్స్ : తీవ్రమైన అనారోగ్యంతో ఎవరైనా హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు డాక్టర్లు మొదటగా సజెష్ చేసేది బ్లడ్ టెస్టునే. ఈ టెస్టులు చేసేముందు రోగి శరీరం నుంచి రక్తం సేకరించడానికి సాధారణంగా సూది(నిడిల్)నే ఉపయోగిస్తుంటారు. అయితే ఇటీవల ఏఐ టెక్నాలజీతో వైద్య రంగంలో సరికొత్త మార్పులు సంతరించుకుంటున్నాయి. సేవలు, చికిత్సలు, నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి. ఇందులో భాగంగానే మహిళలు, పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందించే హైదరాబాద్‌లోని నీలోఫర్ ప్రభుత్వ ఆస్పత్రి దేశంలోనే తొలిసారిగా, సూదిరహిత బ్లడ్ టెస్టులు(needle-free blood test) చేయగల ఏఐ ఆధారిత (AI-powered) టూల్‌ను ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏఐ ఆధారిత నిడిల్ ఫ్రీ (needle-free)బ్లడ్‌టెస్ట్ టూల్‌ పేరు అమృత్ స్వాస్థ్ భారత్, కాగా దీనిని క్విక్ విఠల్స్ (Quick Vitals) అనే హెల్త్-టెక్ స్టార్టప్ అభివృద్ధి చేసింది. అయితే మన దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా దీనిని ప్రవేశపెట్టలేదు. ఫస్ట్ టైమ్ నీలోఫర్‌లో ప్రారంభించడంతో తొలిసారిగా ఈ విధమైన సాంకేతికతను ప్రవేశపెట్టిన ఘనత నీలోఫర్ హాస్పిటల్‌(Niloufer Hospital)కు దక్కిందనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ టెక్నాలజీ ఫోటోప్లెథిస్మోగ్రఫీ (Photoplethysmography - PPG) అండ్, AIని ఉపయోగించి, చర్మం ద్వారా రక్త ప్రవాహంలోని సూక్ష్మ మార్పులను విశ్లేషించి 20-60 సెకన్లలోనే బ్లడ్ టెస్ట్ ఫలితాలను అందిస్తుంది. కాబట్టి రక్త పరీక్షలు చేయడానికి రోగి శరీరం నుంచి సూదిద్వారా రక్తం సేకరించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఇది రక్తపోటు, SpO2, హృదయ స్పందన రేటు, హిమోగ్లోబిన్ A1c, స్ట్రెస్ లెవెల్స్ వంటి హెల్త్ పారామిటర్స్(parameters)ను అంచనా వేస్తుంది.

Next Story