- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

కొనుగోలుదారులకు సకాలంలో ఇండ్లు అప్పగించడంలో హైదరాబాద్ ముందంజలో ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా..
హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణం పూర్తి చేసి నిర్ణీత సమయంలో..
అప్పగించడమే టార్గెట్‌గా నిర్మాణాదారులు పనిచేస్తున్నారు.
హైదరాబాద్ నగరం 2024–2025 ఆర్ధిక సంవత్సరంలో..
57 వేల బిల్డింగ్ యూనిట్లు అందజేసినట్టు అధికారిక లెక్కలు చేబుతున్నాయి.
అదేవిధంగా 2023–24లో 35వేలకు పైగా అందించినట్టు తెలుస్తోంది.
ఇదే సమయాల్లో బెంగుళూర్లో 46 వేలు
చెన్నైలో 19 వేల చొప్పున అందించినట్టు సమాచారం.
- దిశ, రంగారెడ్డి బ్యూరో
గతేడాదిలోనే 60 శాతం వృద్ధి..
హైదరాబాద్ నగరంలో గత రెండ్లేండ్లల్లో నిర్మాణాల్లో గతేడాదిలోనే 60 శాతం వృద్ధి రేటు నమోదైంది. గత ఆర్ధిక సంవత్సరంలో దేశంలోని తొమ్మిది నగరాల్లో 4 లక్షలకు పైగా, అంతుకు ముందు ఆర్ధిక సంవత్సరంలో మూడు లక్షల ఇండ్లు నిర్మాణం పూర్తి చేసినట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. ఒక్క ఏడాది కాలంలోనే 33 శాతం వృద్ది రేటుతో కొనుగోలుదారులకు అందజేసినట్టు నివేదికలో రూపోందించారు. నిర్ధేశించిన సమయంలో ఇండ్లు అప్పగింతలో పశ్చిమాది నగరాల వాట 55శాతం ఉన్నట్టు స్పష్టమైయింది. వరసగా మూడు సంవత్సరాల్లో 10 లక్షలకు పైగా ఇండ్లు నిర్మాణం చేసి గడువులోగా లబ్ధిదారులకు అప్పగించారు.
ఢిల్లీలోనే తగ్గిన వైనం
నిర్ధేశించిన సమయంలో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి అప్పగించడంలో ఢిల్లీ నగరం వెనుకబడినట్టు నివేదికలు చెబుతున్నాయి. 2023–24 ఆర్ధిక సంవత్సరంతో 2024–25 పోలిస్తే కేవలం 8 శాతం మాత్రమే గడువులోగా ఇండ్లు అప్పగించినట్టు తెలుస్తోంది. దేశంలో అత్యధికంగా కోల్కత్తా, అతి తక్కువగా ముంబై నగరంలో ఇండ్లను అప్పగించినట్టు సమాచారం. ఏడాది కాలంలో కోల్‌కతలో 85 శాతం, ముంబైలో 22శాతం వృద్దిగా నమోదయింది.
సకాలంలో పూర్తి
2018–19 మధ్య సంవత్సరంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌లు 2025 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తున్నాయి. కరోనా కాలంలో లాక్డౌన్, రాకపోకలపై నిబంధనలు ఉండటం, వలస కార్మికులను సొంత ఊళ్లకు వెళ్లగొట్టడంతో నిర్మాణ పనులు మందకొడిగా సాగాయి. రెండేండ్లుగా సానుకూలంగా మార్కెట్ లేకపోవడంతో జాప్యం జరిగింది. చేతిలో నగదు అందుబాటులో లేకపోవడంతో కూడా నిర్మాణాలు జరుగలేదు. కానీ నిలిచిపోయిన పనులను పునరుద్దరణ కోసం స్పెషల్ విండొర్ అఫర్డబుల్ అండ్ మిడ్ ఇన్‌కం హౌసింగ్ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్) ఫండ్ లభ్యత తదితర కారణాలతో నిర్మాణ పనులు వేగం పెరిగింది. వీటితో పాటు రేరాలో నమోదైన ప్రాజెక్టులు గడువులోగా పూర్తి చేయాలనే పలు కఠిన నిబంధనలతో డెవలపర్లు ప్రాజెక్ట్ అప్పగింతలపై దృష్టి పెట్టాయి. దీంతో 2025 ఆర్ధిక సంవత్సరంలో కొనుగోలుదారులకు సకాలంలో ఇండ్లను అత్యధికంగా అందించే అవకాశం ఉంది.






