- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Kitchen Killer.. వంటింట్లో క్రైమ్ థ్రిల్లర్స్.!

మీకు కుకింగ్ రాదా.?
డోంట్ వరీ.. యూట్యూబ్ నేర్పిస్తుంది.
చాలా సింపుల్.
కుక్కర్ తీసుకోవాలి.
కట్‌చేసిన మనిషి కాళ్లు.. చేతులను వేయాలి.
తర్వాత ఎండబెట్టాలి.
రోకలితో దంచి పౌడర్‌గా మార్చాలి.
ఫినిష్.!!
కుకింగ్ గురించి చెప్తారనుకుంటే ఇదేంటి అంటారా.?
అలా తయారయ్యారు జనాలు.
కుక్కర్‌లో వంటలే కాదు..
కొత్త కొత్త క్రైమ్ థ్రిల్లర్లు వడ్డిస్తున్నారు.!
- దాయి శ్రీశైలం
అర్థమైంది కదా టాపిక్ ఏందో. మానవమృగం గురుమూర్తి మర్డర్ స్టోరీ విన్నాక వామ్మో అంటున్నారంతా. ప్రాణం పోయడానికి ఏ టెక్నాలజీ గుర్తురాదు. అదే తీయడానికైతే అన్నీ గుర్తొస్తాయి. యూట్యూబ్ గుర్తొస్తుంది. ఓటీటీ గుర్తొస్తుంది. క్రైమ్ సినిమాలు.. ఒళ్లు గగుర్పొడిచే వెబ్ సిరీస్‌లు.. అన్నీ ఫటా ఫట్ గుర్తొస్తాయి. వామ్మో డిటెక్టివ్‌లకూ దొరకని క్రైమ్ ప్లాన్లవ్వీ. భయమేస్తుందిరా అయ్యా మీ క్రైమ్ కథలు చూస్తుంటే.!
ఖతం.. చంపాల్సిందేనా.?
మనిషి మరీ ఇంత ఘోరంగా తయారయ్యాడేంటి.? ఆ మర్డర్ ప్లాన్.. సినిమాటిక్ సీన్లు చూస్తుంటే భయానికే భయం పుట్టేట్టుంది. ఒళ్లు గగుర్పొడిచే సినిమాలు చూశాం కానీ.. గురుమూర్తి రియల్‌గా చూపెట్టాడు. ఆర్మీ జవానుగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ క్రూరత్వం ఏంటో.. అసలు చంపేయాలనే ఆలోచనేందో.? ప్రకాశం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నావ్. ఎంత బాధ్యతగా ఉండాలి గురూ.? నీ అనుమానం పాడుగానూ. ఏదన్నుంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా.? ఇలా చంపి ముక్కలు చేసుడేందయా.? మనసు మీదికొస్తే ఖతం చేసుడేనా.? ఎక్కడుంది మానవత్వం.? భార్య.. భర్త అనే బంధాలకు అర్థమేది.?
యూట్యూబ్ నేర్పిస్తోంది
భార్యతో రోజూ గొడవలు జరిగేవి. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేదు గురుమూర్తి. క్లూ దొరక్కుండా భార్యను ఎలా హతమార్చాలో సెర్చ్ చేశాడు. యూట్యూబ్‌నైతే జల్లెడ పట్టినట్లున్నాడు. సోషల్ మీడియాలో లేని సరుకేముందీ.? మర్డర్ ఎలా చేయాలి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? రెండో కంటికి కనబడకుండా ఏమేం ట్రిక్స్ ఫాలో అవ్వాలో అన్నీ తెలుసుకున్నాడు. భార్యను చంపి ముక్కలుగా చేసి.. కుక్కర్‌లో ఉడకబెట్టి.. ఆ తర్వాత ఆరబెట్టి.. అటెన్క పొడిగా తయారుచేసి చెరువులో కలిపేశాడు. చూశారా.. యూట్యూబ్.. కుక్కర్‌లో పప్పు మాత్రమే కాదు.. ప్రాణం తీసి ఎలా ఉడకబెట్టాలో కూడా చెప్తోంది.. జాగ్రత్త.!
క్రైమ్ సినిమాల సెర్చింగ్
గురుమూర్తి యూట్యూబ్ ఒక్కదానిమీదనే ఆధారపడలేదు. ఎందుకంటే మనోడు వేసింది డిటెక్టివ్ ప్లాన్ కదా.? క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, హారర్ సినిమాలు, సీరియల్ మర్డర్ సినిమాలు చాలానే చూశాడు. కత్తి ఎక్కడ కొనాలి..? కవర్లు ఎక్కడ పారేయాలి..? రక్తం రాకుండా ఏ రసాయనాలు వాడాలి..? బయటకు వాసన రాకుండా ఎలాంటి యాసిడ్లు పోయాలి.? వంటివన్నీ పలు సినిమాల్లో చూసి తెలుసుకున్నాడు. ఏదో ఒక్కరోజులో వేసిన ప్లాన్ కాదిది. చాలారోజులుగా దీనిపై రీసెర్చ్ చేస్తున్నాడు. ఒక్కటంటే ఒక్క ఆధారం దొరకొద్దు అనేది అతడి ప్లాన్. ఇంకేముందీ అవన్నీ సినిమాల్లోనే దొరికాయి.
సూక్ష్మదర్శిని దింపేశాడు
రీసెంట్‌గా సూక్ష్మదర్శిని అనే మళయాలం మూవీ ఓటీటీలోకి వచ్చింది. సొంత చెల్లినే చంపేసి చిన్న క్లూ కూడా దొరక్కుండా రసాయనాలతో బాడీనంతా ద్రవంలా మార్చేసి డ్రైనేజీలోకి వదులుతారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆమె న్యూజీలాండ్ నుంచి వచ్చి వెళ్లినట్లు సీన్ క్రియేట్ చేసి ఇంట్లోనే హతమారుస్తారు. గురుమూర్తి ఈ సినిమాను పక్కా చూసుంటాడు. కుక్కర్లో ఉడికించడం.. పొడి చేసి చెరువులో వేయడం వంటివన్నీ సూక్ష్మదర్శిని లాంటి సినిమాలు నేర్పినవే. డెడ్ బాడీనెలా మాయం చేయాలో తెలుసుకునేందుకు దృశ్యం సినిమాను చాలాసార్లు చూశాడు. ఇదన్నమాట సినిమాలు నేర్పేది.?
కుక్కపై ఎక్స్‌పరిమెంట్
ఆవేశం కొద్దీ హతమార్చి.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దనే సూత్రాన్ని బాగా ఫాలో అయ్యాడు గురుమూర్తి. ప్లాన్ పక్కా వర్కవుట్ అయ్యేలా ముందు కుక్కపై ఎక్స్‌పరిమెంట్ చేశాడు. అది సక్సెస్ అయ్యాకే భార్యమీద ప్రయోగించాడు. చూశారా మనిషి మెదడులో ఎంత క్రూరత్వం దాగివుందో.? క్రూరత్వం అనే పదం కూడా సరిపోదు ఇలాంటి ఘటనలకు. తప్పు చేసినవాడెప్పుడూ తప్పించుకోలేడు. అయ్యగారు అన్నీ జాగ్రత్తలు పాటించాడు కానీ.. సీసీ కెమెరాలకు దొరక్కుండా తప్పించుకోలేదు. ఏమో ఇంకో రెండుమూడు క్రైమ్ సినిమాలు చూసి ఉంటే దాన్నికూడా ఫాలో అయ్యేవాడేమో.?
ఇంత కాఠిన్యమా.?
గురుమూర్తిలాంటి కఠినాత్ములు చాలా ఉన్నారు. కుషాయిగూడకు చెందిన సచిన్ సత్యనారాయకు స్నేహతో ఇన్‌స్టాగ్రాంంలో పరిచయం ఏర్పడింది. ఒకర్నొకరు ఇష్టపడి పెండ్లి చేసుకున్నారు. స్నేహ గర్భిణి. ఆమెపై అనుమానంతో చంపేయాలి అనుకున్నాడు భర్త. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమెపై కూర్చొని చంపితే శిశువు కూడా బయటకొచ్చింది. ఇలాంటివన్నీ ఎక్కడ చూసి నేర్చుకుంటున్నారో అర్థం చేసుకోండి.
కర్రీస్ అండ్ సైనైడ్
ఇదికూడా మళయాలం క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. ఒకే ఇంట్లో జరిగిన ఆరు వరుస హత్యల నేపథ్యంతో జూలీ జోసెఫ్ అనే మహిళ కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. శనగల కూరలో సైనైడ్స్ కలిపి జూలీ జోసెఫ్ ఒకొక్కర్ని ఎలా హతమార్చిందో చూపెట్టారు. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. కానీ గురుమూర్తి లాంటి వారికి ఎలా హతమార్చాలో నేర్పేలా ఉన్నాయి ఇలాంటి సినిమాలు.
వాటితో జాగ్రత్త
ఓటీటీలు విస్తరించిన తర్వాత రకరకాల సినిమాలు, షోలు, సిరీస్‌లు వస్తున్నాయి. అనవసర చెత్తనంతా మెదడులోకి ఎక్కించుకొని తర్వాత ఇగో ఇలా గురమూర్తిలా ఆలోచించే అవకాశం ఉంది కాబట్టీ అలాంటివాటితో జాగ్రత్త. ముఖ్యంగా పిల్లలు. అడల్ట్ కంటెంట్, క్రైమ్‌ను ప్రేరేపించే సిరీస్‌లు దాపురించాయి కాబట్టీ పిల్లల చేతికి ఫోన్లు ఇవ్వకపోవడమే మంచిది.