ప‌డ‌కమీద‌ స్త్రీలకు మూడు రకాల భావప్రాప్తి.. ఎలా వ‌స్తుందో తెలుసా..?!

by Disha Web Desk 20 |
ప‌డ‌కమీద‌ స్త్రీలకు మూడు రకాల భావప్రాప్తి.. ఎలా వ‌స్తుందో తెలుసా..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః సెక్స్‌లో భావ‌ప్రాప్తి క‌లిగిన‌ప్పుడే భాగ‌స్వామికి సంతృప్తిగా ఉంటుంది. అయితే, ప‌డ‌క‌పైన స్త్రీలల్లో సాధారణంగా ఉండే మూడు రకాల భావ‌ప్రాప్తిలో ఒక్కోసారి ఒకదాన్ని అనుభవిస్తారని ఒక అధ్యయనం చెబుతోంది. ఈ స్ట‌డీలో మ‌హిళా వాలంటీర్లు క్లైమాక్స్‌కు చేరుకున్నప్పుడు, వారి కటి ఉప‌రిత‌ల‌ కండరాలు ప్రధానంగా మూడు ర‌కాల భావ‌ప్రాప్తి నమూనాల్లో ఒకదానిని చూపించాయని పరిశోధకులు చెప్పారు. అవి: 'వేవ్ (wave)', 'అగ్నిపర్వతం (volcano)', 'హిమపాతం (avalanche)'. భావ‌ప్రాప్తి సమయంలో ఒత్తిడిని తగ్గించే సంకోచాల వ‌ల్ల‌ అధిక పెల్విక్ ఫ్లోర్ టెన్షన్‌పై హిమపాతం వ‌స్తుంది. ఇక‌, అగ్నిపర్వతం తక్కువ పెల్విక్ ఫ్లోర్ టెన్షన్‌పై ప్రయాణిస్తుంది. అయితే, ఈ ర‌కం భావ‌ప్రాప్తి సమయంలో టెన్ష‌న్‌తో కూడిన సుఖం విడుదల అవుతుంది. అలాగే, 'వేవ్' భావ‌ప్రాప్తి అనేది టెన్ష‌న్‌, విడుదల స‌మ‌యాల్లో ఉప్పెనలా, వరుస సంకోచాలతో కనిపిస్తుందని ప‌రిశోధ‌న‌లో క‌నుగొన్నారు.

ఈ అధ్యయనం కోసం, 54 మంది మహిళలు బ్లూటూత్-కనెక్ట్ చేసిన‌ వైబ్రేటర్‌ను ఉపయోగించారు. దీనిని లియోనెస్ అని పిలుస్తారు. ఇది దాని వైపులా ఉన్న రెండు సెన్సార్‌లలో కటి ఉప‌రిత‌ల‌ సంకోచాల శక్తిని గుర్తించి డేటాను ఇంటర్నెట్ సర్వర్‌కు పంపుతుంది. ఇంట్లోనే ఉండి పనులు చేసిన మహిళలు, భావప్రాప్తికి స్వీయ-ప్రేరేపణ చేసి, భావప్రాప్తి పొందిన రెండు నిమిషాల తర్వాత పరికరాన్ని ఆఫ్ చేయాలని సూచించారు. మ‌హిళలు నియంత్రణ పరీక్ష చేయమని అడిగారు, దీనిలో వారు వైబ్రేటర్‌ను చొప్పించారు కానీ తమను తాము ప్రేరేపించలేదు. త‌ర్వాత‌ డేటాను విశ్లేషించారు. దాదాపు 50% మంది మహిళలు 'వేవ్' భావప్రాప్తిని పొంద‌గా, కొంత‌ మందికి 'హిమపాతాలు', ఇంకొంద‌రికి 'అగ్నిపర్వతాలు' వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఈ అధ్య‌య‌నం సెక్సువల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. భావప్రాప్తి రుగ్మతలకు చికిత్స పొందుతున్న మహిళలకు ఈ అధ్య‌య‌నం సహాయం చేస్తుంద‌ని భావిస్తున్నారు.

Sexy Bomb'.. మరింత మత్తుగా బ్యాక్ అందాలు ప్రదర్శించిన ఈషా

ఆ హీరోయిన్‌కు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తల్లి.. పైసలు కూడగట్టేందుకు

విటమిన్ బి6 అధిక మోతాదుతో నడక కోల్పోయిన వ్యక్తిNext Story