వార్ యాంగ్జయిటీని తగ్గించుకోవడం ఎలా.?

by Daayi Srishailam |

ఈ డిజిటల్ ఒత్తిడి నుంచి బయటపడేందుకు నిపుణులు కొన్ని సులభమైన మార్గాలను సూచిస్తున్నారు.

వార్ యాంగ్జయిటీని తగ్గించుకోవడం ఎలా.?
X

యుద్ధ వార్తలు..

విపత్తు వీడియోలు..

బాంబుల రీల్స్..

బాధాకర సన్నివేశాలు..

డ్రోన్ల చక్కర్లు.. తరుచూ ఇవే గుర్తుకొస్తున్నాయా.?

ఆందోళన.. నిద్రలేమి.. ఒత్తిడి పెరుగుతున్నాయా.?

ఈ డిజిటల్ ఒత్తిడి నుంచి బయటపడేందుకు నిపుణులు కొన్ని సులభమైన మార్గాలను సూచిస్తున్నారు.

- దిశ, ఫీచర్స్

లిమిట్స్ పెట్టుకోండి

సోషల్ మీడియాకు సమయం పరిమితం చేయండి. రోజుకు 15-30 మాత్రమే వార్తలు.. ఇతర అప్‌డేట్స్ తెలుసుకోవడానికి కేటాయించండి. అతిగా స్ర్కోలింగ్ చేయడం ఒత్తిడిని పెంచుతుంది. సరైన సమాచారం కోసం ధృవీకరించిన వార్తా సంస్థలను ఫాలో చేయండి. బాధాకరమైన లేదా గ్రాఫిక్ కంటెంట్‌ను మ్యూట్ చేయండి. కొంతకాలం ఇన్‌స్టా‌గ్రామ్‌.. ఎక్స్‌లో "స్నూజ్" లేదా "మ్యూట్" ఆప్షన్లను ఉపయోగించండి.

భావోద్వేగ నియంత్రణ

తరుచూ "వార్" సంఘటనలే గుర్తొస్తే 5-4-3-2-1 గ్రౌండింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి. దీని ప్రకారం.. 5 వస్తువులను చూడాలి. 4 వస్తువులను తాకాలి. 3 శబ్దాలను వినాలి. 2 వాసనలను గుర్తించాలి. ఒక రుచిని గమనించాలి. ఇది మనసును ప్రస్తుత క్షణంలోకి తీసుకొస్తుంది. దీంతోపాటు బాక్స్ శ్వాస వ్యాయామం కూడా చేయాలి. దీని ప్రకారం.. 4 సెకన్లు శ్వాస తీసుకొని.. 4 సెకన్లు ఆపాలి. మళ్లీ 4 సెక్లను విడిచి.. అట్లనే 4 సెకన్లు ఆపాలి. ఇది నాడీ వ్యవస్థను శాంత పరుస్తుంది.

భావాలను పంచుకోండి

స్నేహితులతో మాట్లాడుతూ ఉండాలి. "ఈ వార్తలతో నువ్వు ఎలా ఉన్నావ్" అని దోస్తులను అడిగి.. భావాలను పంచుకుంటే ఆందోళన తగ్గుతుంది. సోషల్ మీడియా కంటెంట్ ద్వారా కలిగే ఒత్తిడి గురించి చర్చించే గ్రూపులలో చేరండి. ఇవి సురక్షితమైనవిగా ఉంటాయి. ఇంకా కుటుంబ.. విద్యాసంస్థలు.. తల్లిదండ్రులు.. టీచర్లతో ఓపెన్‌గా ఉండాలి. వెంటాడే సంఘనటలను దూరం చేసుకోవాలి. ఆర్ట్.. స్కెచింగ్.. బుక్స్ రీడింగ్ వంటివి మనసును శాంత పరుస్తాయి. డిజిటల్ సౌండ్స్ నుంచి విశ్రాంతిస్తాయి. రోజులో 10-15 నిమిషాలు ఫోన్‌ను పక్కనపెట్టి డిజిటల్ డిటాక్స్ పాటించాలి.

శాస్త్రీయ అవగాహన

సోషల్ మీడియా "డోపమైన్"ను విడుదల చేస్తుంది. కానీ యుద్ధవార్తలు "కార్టిసాల్"ను పెంచుతాయి. "డోపమైన్" అనేది ఆనంద హార్మోనైతే.. "కార్టిసాల్" ఒత్తిడి హార్మోన్. సో.. ఈ చక్రాన్ని గుర్తించడం ద్వారా నియంత్రణ పాటించవచ్చు. అన్నీ తెలుసుకోవాలనే రూలేం లేదు కదా. ఏది ఎంత వరకు అవసరమో అంతే తెలుసుకొని మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

ఈ రోజే మొదలుపెట్టండి

ఉదయం: లేవగానే ఫోన్‌ను తీయకండి. స్ట్రెచింగ్ లేదా జర్నలింగ్‌తో రోజును ప్రారంభించండి.

రాత్రి: నిద్రకు 1-2 గంటల ముందు స్ర్కోలింగ్ ఆపండి.

భయం.. బాధను ఒప్పుకోండి. మీ మనసు మీకు కృతజ్ఞత చెప్తుంది. ఆల్ ది బెస్ట్.!!

Next Story