Fatty liver disease : 'ఫ్యాటీ లివర్ డిసీజ్‌'ను గుర్తించడం ఎలా?

by Disha Web Desk 10 |
Fatty liver disease : ఫ్యాటీ లివర్ డిసీజ్‌ను గుర్తించడం ఎలా?
X

దిశ, ఫీచర్స్ : మానవ శరీరంలో కాలేయం కూడా ఎంతో ముఖ్యమైనది. దీని పనితీరు సక్రమంగా లేకపోతే తీవ్ర అనారోగ్యంతో పాటు ప్రాణహాని కలుగవచ్చు. అందుకే కాలేయ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాలేయానికి వచ్చే పలు వ్యాధుల్లో 'ఫ్యాటీ లివర్ డిసీజ్' ఒకటి. కాలేయంలో అధికంగా కొలెస్ర్టాల్ పేరుకుపోవడంవల్ల ఇది వస్తుంది.

ఫ్యాటీ లివర్ డిసేజెస్ రకాలు

ఆల్కహాల్ తరచూ తీసుకునే అలవాటు ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తే 'ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్' అంటారు. ఒకవేళ ఆల్కహాల్ తాగే అలవాటు లేనివారిలో వస్తే 'నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్' అని పిలుస్తారు. కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇది వస్తుంది. డయాబెటిస్, హైబీపీ సమస్యలతో బాధపడుతున్నవారిలో కూడా కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. ఇలా పేరుకుపోవడంవల్ల అది మూత్ర పిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి వ్యాధి లక్షణాలను గుర్తించగానే వైద్య నిపుణులను సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. సరైన సమయంలో ట్రీట్ మెంట్ తీసుకోకపోతే ప్రాణహాని కలుగవచ్చు.

పొత్తికడుపులో నొప్పి

ఫ్యాటీ లివర్ డిసీజెస్ ఉన్నవారిలో కడుపు నొప్పి, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడంవల్ల పొత్తికడుపులో నొప్పి వస్తుంది. ఈ నొప్పి పొట్టకు కుడివైపున ఎగువ భాగంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నొప్పి వస్తున్న ప్రదేశంలో ఏదో అడ్డంకిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నొప్పి కుడి భాగం నుంచి మొత్తం పొత్తికడుపు అంతా వ్యాపిస్తుంది. కొందరిలో పొత్తికడుపు భాగంలో వాపు కూడా రావచ్చు.

వికారం, వాంతులు

కాలేయంలో అధికకొవ్వు ఉన్నవారిలో తరచూ వికారంగా అనిపించడం, వాంతులు అవ్వడం, అలసటగా, అనారోగ్యంగా కనిపించడం గమనించవచ్చు. పొట్టనొప్పి కారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడినట్టు ఆ రోగి కనిపిస్తాడు. కొందరిలో ఆకలి మందగిస్తుంది. వాంతింగ్ సిమ్టమ్స్ తరచూ కనిపిస్తుంటాయి.

బరువు తగ్గుతారు

ఫ్యాటీ లివర్ డిసీజెస్ ఉన్న వ్యక్తికి తిన్నా, తినకపోయినా పెద్ద తేడా ఉన్నట్టు అనిపించదు. ఆకలి వేయకపోవడంవల్ల, సమయానికి ఫుడ్ తీసుకోకపోవడంవల్ల బాధితులు బలహీనంగా మారిపోతారు. బరువు తగ్గిపోతాడు. ఆకస్మికంగా తగ్గుతున్నా, ఆకలి వేయకపోయినా తేలిగ్గా తీసుకోవద్దు. ఫ్యాటీ లివర్ డిసీజ్‌ లక్షణాల్లో ఇదీ ఒకటి అని గుర్తించాలి.

చర్మం పసుపు రంగులోకి మారుతుంది

ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడిన వారు తరచూ గందరగోళ పడుతుంటారు. ఆలోచనా తీరులో నిలకడ ఉండదు. చిరాకు కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం ఆగదు. చర్మం పసుపు రంగులోకి మారుతుంది. ఎవరైనా ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత, థైరాయిడ్, హైబీపీ, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతుంటే గనుక, వారిలో ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ధూమపానం, మద్యపానం, అపరిశుభ్రమైన ఆహారపు అలవాట్ల కారణంగా కూడా ఈ వ్యాధి వస్తుంది. 50 ఏండ్ల వయస్సు పైబడినవారిలోనూ వచ్చే చాన్స్ ఎక్కువ. అందుకే లక్షణాలను బట్టి బాధితులు వెంటనే అప్రమత్తమై చికిత్స పొందడంవల్ల మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.



Next Story

Most Viewed