వడగళ్లు ఎలా ఏర్పడుతాయి.. వాటిని తింటే ప్రమాదమా?

by Disha Web |
వడగళ్లు ఎలా ఏర్పడుతాయి.. వాటిని తింటే ప్రమాదమా?
X

దిశ, వెబ్ డెస్క్: గత మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా వడగళ్ల వానలు వచ్చి జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే అసలు ఈ వడగళ్ళు ఎలా ఏర్పడతాయి.. వీటిని తింటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం.

వడగళ్లు మేఘాల్లో 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కోల్డ్ వాటర్ ద్వారా ఏర్పడుతాయి. దీనికి దుమ్ము, రేణువులు, వర్షపు బిందువులు కలిసినప్పుడు వడగళ్ల వానలు కురిసి నేలపై మంచు ముక్కల్లా పడతాయి. సల్ఫేట్, నైట్రేట్, అమ్మోనియం, అయాన్లు, క్లోరైడ్ వంటి రసాయనాలు కలిగి మంచు ఈ ముక్కలు ఉంటాయట. అలాగే ఇవి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. రసాయనాలను కలిగి ఉండటంతోనే వీటిని తినవద్దని.. పెద్దలు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వడగళ్లను తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read more:

ఖైదీలకు మెగా ఆఫర్.. వేశ్యను పెళ్లి చేసుకుంటే జైలు నుంచి రిలీజ్
Next Story