హోలీ రోజు కీలక పరిణామం..12 ఏళ్ల తర్వాత నేడు ఏం జరగబోతుందంటే?

by Dishanational2 |
హోలీ రోజు కీలక పరిణామం..12 ఏళ్ల తర్వాత నేడు ఏం జరగబోతుందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : హోలీ పండుగను ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది హోలికా దహన్ మార్చి 7న జరగనుంది. హోలీని మార్చి 8న ఆడనున్నారు. అయితే ఈ ఏడాది హోలీ రోజున గ్రహాల ప్రత్యేక సంయోగం జరుగుతుంది. పండుగ రోజు దేవతలకు గురువు, రాక్షసుల శుక్రుడు మీన రాశిలో ఉండబోతున్నారు. ఈ పరిణామం 12 ఏళ్లతర్వాత జరగబోతుంది.దీని ప్రభావంతో మూడు రాశుల వారికి అదృష్టం ఏర్పడబోతుంది.

మేష రాశి : హోలీ నుంచి మేష రాశి వారికి మంచి రోజులు రానున్నాయి. ఆకస్మిక ధనలాభం. ఆర్థికంగా ఎదుగుదల,మధ్యలో ఆగిపోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి.

వృషభ రాశి : ఈ రాశి వారికి హోలీ నుంచి ఆదాయాలలో పెరుగుదల ఏర్పడుతుంది. అంతే కాకుండా పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు కొత్త వాహనాలు లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

Also Read..

కనువిందు చేయనున్న అత్యంత ప్రకాశవంతమైన చంద్రుడు..

నేటి రాశిఫలాలు.. హోలీ ఈ రాశి వారి జీవితంలో అద్భుతాన్ని తెస్తుంది



Next Story

Most Viewed