సోష‌ల్ మీడియాలో కొత్త బ‌ర్త్‌డే ట్రెండ్..! (వీడియో)

by Disha Web Desk 20 |
సోష‌ల్ మీడియాలో కొత్త బ‌ర్త్‌డే ట్రెండ్..! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఈ కాలంలో ట్రెండ్ ఫాలో అవ్వాల‌న్నా, కొత్త ట్రెండ్ సృష్టించాల‌న్నా సోష‌ల్ మీడియాను ఆశ్ర‌యిస్తే స‌రిపోతుంది! ట్రెండ్ సృష్టించేది సినిమా యాక్ట‌ర్లే కాదు, వాళ్లే మ‌మ్మ‌ల్ని ఫాలో అవుతార‌న్న‌ట్లు సోష‌ల్ మీడియా యోధులు నిరూపిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఇద్దరు చిన్నారులు కూడా ఈ కోవ‌లోని వారే. ఈ చిన్నారులు రూపొందించిన ఓ రీల్ ఇప్పుడు క్రేజీగా వైరల్ అవుతోంది. ఈ వీడియో 'myra_mysha' పేజీలో షేర్ చేశారు. "మేము పంజాబీలం. ప్రతి సందర్భానికి మా ద‌గ్గ‌ర‌ పాటలు ఉంటాయి. మైషా పుట్టినరోజు కోసం మైరా దీన్ని సిద్ధం చేసింది. క్రేజీ సోదరీమణులు, "అని క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియోలో మైరా, మైషా అరోరా క‌లిసి బ‌ర్త్‌డే పార్టీలో కొత్త ర‌కం జింగిల్‌ని సృష్టించారు. "ఆజ్ మేరీ బెహెన్ కా బర్త్‌డే హై! ఆజ్ ముఝే కేక్ మిలేగా.. ఆజ్ ముఝే పిజ్జా మిలేగా. ఆజ్ ముఝే గిఫ్ట్ మైలేంగే ఆజ్ మేరీ బెహెన్ కా బర్త్‌డే హాయ్! " అంటూ కొన‌సాగే ఈ పంజాబీ జింగిల్ అక్క తన చెల్లెలు కోసం పాడుతూ నెటిజ‌నుల‌ను ఆక‌ర్షించారు. క్యూట్‌గా పాడిన ఈ పాట‌ను మీరూ చూడండి!Next Story