- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోతి చేతికి కొబ్బరిచిప్ప కాదు, స్మార్ట్ ఫోనొచ్చింది.. అప్పుడేంచేసిందో చూడండి!
ఇంతలో ఒక పెద్ద కోతి వాటితో చేరింది.. Monkeys being shown a video of another set of monkeys on a smartphone.

దిశ, వెబ్‌డెస్క్ః సంవత్సరాలుగా అభివృద్ధిచెందుతున్న సాంకేతికత ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చింది. ఈ పరిణామం మన దైనందిన జీవితంలో భారీ మార్పును తీసుకువచ్చింది. ఒక్కసారి ఊహించుకుంటే మొదటి స్మార్ట్‌ఫోన్‌ను చూసినప్పుడు, ఆ చిన్న గాడ్జెట్ ఎలాంటి అద్భుతమైన పనులు చేయగలదో తెలుసుకున్నప్పుడు సామాన్య మనిషి సంభ్రమాశ్చర్యాలకు గురై ఉంటారు. ఇక అదే స్మార్ట్ ఫోన్ కోతుల చేతుల్లోకి వెళితే ఎలా ఫీలవుతాయో ఈ వీడియో చూపిస్తుంది. ఓ కోతుల సమూహం చేతికి స్మార్ట్‌ఫోన్ ఇస్తే ఆ సరికొత్త అనుభవానికి అవి నివ్వెరపోయాయి. ఇతర కోతుల చిత్రాలు, వీడియోలను చూడడానికి కోతులు ఫోన్ స్క్రీన్ చుట్టూ చేరాయి. తమలాంటి జీవులే అందులోకి ఎలా వచ్చాయో తెలియక కోతులు దిగ్భ్రాంతి చెందాయి. ఇంతలో ఒక పెద్ద కోతి వాటితో చేరింది. మూడు కోతులు ఫోన్ స్క్రీన్‌ను తాకుతూ సందడి చేశాయి. క్వీన్ ఆఫ్ హిమాచల్ అనే ట్విటర్ యూజర్ ఈ క్యూట్ వీడియోను షేర్ చేయగా, నెటిజనులు కామెంట్లతో అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
Craze Of Social Media🤦♀️🤦♀️ pic.twitter.com/UiLboQLD32
— Queen Of Himachal (@himachal_queen) July 10, 2022






