Uric acid : అధిక యూరిక్ యాసిడ్‌తో అవస్థలా.. ఆయుర్వేదిక్ మూలికలతో చెక్ పెట్టండిలా?

by Javid Pasha |

Uric acid : అధిక యూరిక్ యాసిడ్‌తో అవస్థలా..? ఆయుర్వేదిక్ మూలికలతో చెక్ పెట్టండిలా?

Uric acid : అధిక యూరిక్ యాసిడ్‌తో అవస్థలా.. ఆయుర్వేదిక్ మూలికలతో చెక్ పెట్టండిలా?
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో మూత్రంలో మంట ఒకటి. అధిక యూరిక్ యాసిడ్ వల్ల ఇది సంభవిస్తుంది. దీర్ఘకాలంపాటు నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని ఆయుర్వేదిక్ మూలికలతో కూడా సమస్యను తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.

*మూత్రంలో ఆమ్లత్వం పెరగడాన్నే యూరిక్ యాసిడ్ సమస్యగా పేర్కొంటారు. దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట సంభవిస్తుంది. దీనివల్ల మూత్ర పిండాలలో చిన్న చిన్న స్ఫుటికలు ఏర్పడుతాయి. ఇవి పేరుకుపోవడంవల్ల కీళ్ల నొప్పులు, కాలక్రమేణా వాపునకు దారితీస్తుంది. కిడ్నీలో రాళ్లకు కూడా కారణం అవుతాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆయుర్వేదంలో అందుకు చక్కటి పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు.

*ఆయుర్వేదం వైద్య నిపుణుల ప్రకారం.. గిలోయ్.. (టినస్పోరా కార్డిలియా), అండ్ పునర్నవ (బోర్హావియా డిఫ్యూసా) అనే మూలికలు యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. మూత్ర పిండాల పనితీరును మెరుగు పరుస్తాయి. గౌట్ లేదా హైపర్ యూరిసీమియా వంటి సమస్యలను సైతం నివారిస్తాయి. వీటిలో ఏ మూలికి ఎలా పనిచేస్తుందో కూడా నిపుణులు వివరిస్తున్నారు.

* గిలోయ్ : గిలోయ్ (Guduchi) అనే మూలికలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఫుల్లుగా ఉంటాయి. దీనిని వాడటంవల్ల యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది గౌట్ వల్ల కలిగే కీళ్ల వాపును, నొప్పిని తగ్గిస్తుంది. మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. జీవక్రియను సమతుల్య చేస్తుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ఉదయంపూట ఖాళీ కడుపుతో 10 నుంచి 20 మి. లీ గిలోయ్ రసాన్ని తాగితే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. రసం తాగలేని వారు 1 నుంచి 2 గ్రాముల గిలోయ్ పొడిని తేనె లేదా నీటితో కలిపి రోజుకు ఒకసారి తాగినా మంచి ఫలితం ఉంటుంది.

* పునర్నవ : (Boerhavia diffusa) : పునర్నవ అనే మూలిక కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది. దీనిని ‘హొగ్వీడ్’’ అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలోని వ్యవర్థాలను, అధిక ద్రవాలను తొలగించడం ద్వారా మూత్ర పిండాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండటంవల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అందుకోసం 1 నుంచి 3 గ్రాముల పునర్నవ పొడిని నీరు లేదా తేనెతో కలిపి రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తీసుకోచ్చు. అలాగే పునర్నవ రూట్ లేదా ఆకులను నీటిలో మరిగించి 20 నుంచి మి.లీ. రోజూ తాగవచ్చు. ఇలా చేయడం ద్వారా యూరిక్ యాసిడ్ సమస్య దూరం అవడమే కాకుండా మూత్ర పిండాల పనితీరు మెరుగు పడుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story