- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : ఈజీగా బరువు తగ్గడం ఎలా..? ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం నిపుణుల సూచనలివే..
Health : ఈజీగా బరువు తగ్గడం ఎలా..? ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం నిపుణుల సూచనలివే..

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేక మందిని వేధిస్తు్న్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. నిశ్చల జీవన శైలి, ఒత్తిడితో కూడిన పని విధానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం ఆరోగ్య నిపుణులు సూచిన్న చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం.
* ఆరోగ్యకరమైన ఆహారం : ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా చియా సీడ్స్, అవకాడో, బీన్స్, గుడ్లు, క్వినోవా, దాలియా వంటి వాటిలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి, అనవసర కేలరీల తీసుకోవడాన్ని తగ్గిస్తాయి.
*పరిమితిగా తినండి : ఒకేసారి ఎక్కువ మొత్తంలో కడుపు ఫుల్లుగా అనిపించేలా తినకూడదు. అవసరమైతే ఎక్కువసార్లు తక్కవ పరిమాణంలో భోజంన తీసుకోవాలి. రోజుకు5 నుంచి 6 సార్లు చిన్న భోజనాలు తీసుకోవడం వల్ల శక్తి స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఒకేసారి అధిక భోజనాన్ని నివారిస్తాయి.
*క్రమం తప్పకుండా వ్యాయామం : అధిక బరువను నివారించడంలో ఉపయోగపడే అద్భుతమైన చిట్కా శారీరక శ్రమ. వ్యాయామం, వివిధ పనుల ద్వారా ఇది లభిస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం బరువు నిర్వహణకు ఇది చాలా ముఖ్యం. వాకింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, లేదా గ్రూప్ ఎక్సర్‌సైజ్, డ్యాన్స్ వంటివి కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.
*నీరు ఎక్కువగా తాగండి : రోజుకు కనీసం 12 గ్లాసుల నీరు తాగడం కూడా బరువు నిర్వహణలో కీ రోల్ పోషిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.
* స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ : నిద్ర సరిగ్గా ఉన్నప్పుడు శరీరంలోని జీవక్రియలన్నీ సక్రమంగా కొనసాగుతాయి. కాబట్టి రాత్రిళ్లు తప్పకుండా 6 నుంచి 7 గంటలు నిద్రపోవడం ముఖ్యం. ఇక నైట్‌షిఫ్ట్ వంటివి చేసేవారు ఈ నిద్ర సమయాన్ని పగటి పూట కవర్ చేయవచ్చు. మొత్తానికి క్వాలిటీ స్లీప్ అవసరం. దీంతోపాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం మెడిటేషన్ లేదా సానుకూల వ్యక్తులతో సమయం గడపడం, ప్రకృతితో కనెక్ట్ అవ్వడం, పుస్తకాలు చదవడం వంటివి చేయవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






