- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Toxic friendship : స్నేహం మంచిదే.. కానీ స్నేహితుల్లో కొందరు అలాంటివారు కూడా..
Toxic friendship : స్నేహం మంచిదే.. కానీ స్నేహితుల్లో కొందరు అలాంటివారు కూడా..

దిశ, ఫీచర్స్: స్నేహంలోని గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే. మనుషుల మధ్య మమతాను రాగాలను పెంపొందించే గొప్ప వారధిగా అందరూ అంగీకరిస్తారు. అయితే స్నేహం ముసుగులో మోసాలు కూడా ఉంటాయి. పైకి మంచిగా మాట్లాడుతూనే లోలోన కుళ్లుకుంటారు. మేలు చేస్తున్నట్లే నటిస్తూ.. కీడును తలపెడతారు. దీనినే విషపూరిత స్నేహం (Toxic friendship) అంటున్నారు నిపుణులు. దాని లక్షణాలేమిటి? ఏ విధమైన ప్రవర్తనకు దారితీస్తుందో ఇప్పుడు చూద్దాం.
మిమ్మల్ని డైవర్ట్ చేసేందుకు ట్రై చేస్తారు..
మీ దృష్టిలో బెస్ట్‌గానే ఉంటారు. కానీ మీతో మాట్లాడుతున్నప్పుడో, గ్రూప్ డిస్కషన్‌లో ఉన్నప్పుడో మీరు చెప్పే విషయాలను పూర్తిగా వినకుండానే జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తుంటారు. మీకు మేలు చేసే ముఖ్యమైన విషయాలను చర్చకు రాకుండా అడ్డుపడుతుంటారు. అలాంటి అంశాలు లేవనెత్తినప్పుడల్లా టాపిక్ డైవర్ట్ చేస్తుంటారు. ఇక మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడైతే అస్సలు పట్టించుకోరు. మీరెవరో తెలియదన్నట్లుగానే ప్రవర్తిస్తుంటారు. రోజువారీ ప్రవర్తనలో కూడా వారు చెప్పింది వినడం తప్ప, మీరు చెప్పేది వినిపించుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారికి దూరంగా ఉండటం బెటర్.
వన్‌సైడ్ ఫ్రెండ్‌షిప్
ఫ్రెండ్‌షిప్‌కి మీరు చాలా విలువ ఇస్తారు. సమయం కేటాయిస్తారు. కానీ మీరు స్నేహితుడిగా/స్నేహితురాలిగా భావించే అవతలి వ్యక్తి మాత్రం ఎన్నడూ అలా చేయడు/చేయదు. మీరు ప్రతీ విషయాన్ని చెప్పాలనుకుంటారు. కానీ వారు వారు పట్టించుకోరు. మీరు ఫోన్ చేసి మాట్లాడటం, యోగక్షేమాలు అడగడం వంటివి చేస్తుంటారు. వారు మాత్రం చేయరు. వారు ఎదిగేలా మీరు ప్రోత్సహిస్తారు. కానీ వారు అలా చేయకపోగా.. మీరు సమస్యల్లో ఉంటే.. చూసీ చూడనట్టు తప్పించుకుని తిరుగుతుంటారు. టాక్సిక్ మెంటాలిటీ కలిగిన వ్యక్తిత్వానికి ఇది నిలువెత్తు నిదర్శనం.
అన్‌హెల్తీ కాంపిటీషన్
సరదాగానో, చమత్కారంగానో మాట్లాడుకోవడం, ప్రేమగా పలకరించుకోవడం వంటి హెల్తీ కాంపిటీషన్స్ లేదా బిహేవియర్స్ ఉంటాయి తప్ప, ఒక వ్యక్తికి నష్టం చేకూర్చేలా పోటీ పడటం, ఈర్ష్య చెందడం వంటివి మాత్రం ఉండవు. కానీ కొందరు మాత్రం అలాగే చేస్తుంటారు. విష పూరిత మనస్తత్వానికి, స్నేహానికి ఇది నిదర్శనం. టాక్సిక్ మెంటాలిటీ కలిగిన స్నేహితులు తమ గురించి తాము ఆలోచించుకోవడం కంటే.. తమ ఫ్రెండ్ చేసేదానిని తాము కూడా చేసి గొప్పలు చెప్పుకుంటారు. మీరు ఏదైనా ముఖ్యమైన ప్రయత్నం చేయాలని భావించినప్పుడు, అది తెలిసి.. మీకంటే ముందే వారు చేసేసి ఏదో సాధించినట్టు ఫీలవుతారు.
మీకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తారు
మీకు ఒక వస్తువు నచ్చదు అనుకుందాం. ఈ విషయం తెలిసినప్పటికీ మీ టాక్సిక్ ఫ్రెండ్ అయిన వ్యక్తి పదే పదే దానిని మాత్రమే తీసుకొచ్చి మీ ఎదుట పెడుతుంటారు. లేదా మీకు నచ్చని పనులు చేస్తుంటారు. నచ్చిన టాపిక్ గురించే చర్చిస్తుంటారు. అంటే ఇక్కడ మిమ్మల్ని బాధపెట్టడం, ఇబ్బందికి గురిచేయడం అవతలి వ్యక్తి అసలు లక్ష్యం. కానీ నేరుగా చేయరు. స్నేహం ముసుగులో చేస్తారు. పైగా మీరు అది గుర్తించి కోపంగా చూడగానే బాధపడినట్లు బిహేవ్ చేస్తుంటారు. అలాగే మీరు వారికి ఇష్టమైన విషయాల గురించి మాట్లాడుతున్నప్పటికీ, వారు మాత్రం మీకు నచ్చని లేదా మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేసే మాటలు మాత్రమే మాట్లాడుతుంటారు. మిమ్మల్ని అవసరాలకు ఉపయోగించుకుని, మీకు అవసరం వస్తే మాత్రం పట్టించుకోరు. నిజానికి స్నేహం మంచిదే.. కానీ స్నేహితుల్లో కొందరు మీరంటే అసూయపడే టాక్సిక్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు. తెలిసి మసలు కోండి అంటున్నారు నిపుణులు.






