Trending : Gen Z థాట్స్.. 2026లో యువత కోరుకునేదేమిటి..?!

by Javid Pasha |   (  Updated:2025-12-24 06:27:50  IST  )

వాస్తవం చెప్పాలంటే సమాజంలో ప్రతీదీ మార్పునకు లోబడే ఉంటుంది. అంతెందుకు కొన్ని రోజుల్లోనే మనం కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నాం. ఇది మార్పే కదా.. అయితే ఇక్కడ కాలమొక్కటే కాదు. దానినిబట్టి మనుషులు, మానవ సంబంధాల్లోనూ కొన్ని మార్పులు సంతరించుకుంటాయి

Trending : Gen Z థాట్స్.. 2026లో యువత కోరుకునేదేమిటి..?!
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ క్షణం.. ప్రతీ నిమిషం.. ప్రతీ గంట.. ప్రతీ రోజు.. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఐదారు రోజుల్లో 2025కి గుడ్ బై చెప్పి, 2026లోకి ప్రవేశించబోతున్నాం. ఎప్పుడూ అంతే కాలానికి ఎవరిమీదా దయ, జాలి, ప్రేమ, అసూయ, పక్షపాతం వంటివేవీ ఉండవు. అందరికీ ఒకేలా వర్తిస్తుంది. దాని పని అది చేసుకుంటూ పోతుంది. మనకు నచ్చినా నచ్చక పోయినా, మనం మారినా, మారకపోయినా కాలానికి సంబంధం లేదు. అది మాత్రం మారుతూనే ఉంటుంది. కాబట్టి మనం కూడా కాలంతోపాటు మనమూ పరుగెత్తాల్సిందే. కాలాన్ని అర్థం చేసుకోకపోతే, కాలం విలువ తెలుసుకోకపోతే మనం అక్కడే ఆగిపోతాం.. అందుకే గడిచిన కాలం తిరిగి రాదు. జరిగిందేదో జరిగింది. వచ్చే సంవత్సరం నుంచైనా మనం సరికొత్త ఆలోచించాలని, అనుకున్నది సాధించాలని యువత భావిస్తోంది. అయితే ఈ క్రమంలో జెన్ జీలు(Gen Zs)సంబంధాల విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు? ఏ విధమైన మార్పు కోరుకుంటున్నారో చూద్దాం.

సంబంధాల్లో సానుకూల మార్పు

వాస్తవం చెప్పాలంటే సమాజంలో ప్రతీదీ మార్పునకు లోబడే ఉంటుంది. అంతెందుకు కొన్ని రోజుల్లోనే మనం కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నాం. ఇది మార్పే కదా.. అయితే ఇక్కడ కాలమొక్కటే కాదు. దానినిబట్టి మనుషులు, మానవ సంబంధాల్లోనూ కొన్ని మార్పులు సంతరించుకుంటాయి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 2026 సంవత్సరంలో 2025లోని ఆలోచనలు, పోకడలు(trends) అన్నీ పాతబడిపోతాయి. అవసరమైనవి కొన్ని స్పీడప్ అవుతాయి లేదా మరింత మెరుగైన దిశగా మారుతాయి. అలాంటివాటిలో మానవ సంబంధాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జెన్ జీలలో లవ్, ఫ్రెండ్‌షిప్, డేటింగ్ స్టైల్ కూడా మారనుందని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు లవ్ అండ్ డేటింగ్ ట్రెండ్స్ కాంప్లికేటెడ్‌గా ఉండేవి. 2025లో మారాయి. 2026లో ఇవి కాంప్లకేటెడ్ నుంచి మరింత సింప్లిసిటీలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సెల్ఫ్ కేర్, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్స్

ఈ ఏడాదంతా ఎలాగో గడిచించిది. కొందరు సంతోషంగా, సానుకూలంగా భావించి ఉండవచ్చు. అంతా మంచే జరిగిందని సంబర పడవచ్చు. మరికొందరు గజిబిజిగా, గందరగోళంగా గడిచిందని బాధపడుతుండవచ్చు. ఎలా భావించేవారైనా 2026లో మాత్రం అంతా సానుకూలంగా జరగాలని మాత్రమే అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా యువత తాము అనుకున్న విధంగా కొత్త సంవత్సరంలో మారాలని గట్టిగా డిసైడ్ అయిపోయిందట. అలాంటి మార్పుల్లో అత్యంత ప్రాధాన్యత గలది ఏంటంటే.. ‘వ్యక్తిగత సంరక్షణ, వ్యక్తిగత ఎదుగుదల, మానసిక ఆనందం, ఆరోగ్యంపై ఎక్కువ ఫోకస్ చేయడం, వృత్తి నైపుణ్యాలు పెంచుకోవడం, కుటుంబంతో సంతోషంగా ఉండటం’ అనేదే యువతరం మెజార్టీ అభిప్రాయమని నిపుణులు చెబుతున్నారు.

సంప్రదాయాలు - సడలింపులు

మానవ సంబంధాలు, సంప్రదాయాలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలాన్ని బట్టి మారుతుంటాయి. ప్రతీ సంవత్సరం అనేక మార్పులు చూస్తూనే ఉన్నాం. 2026లోనూ అది జరుగుతుందంటున్నారు నిపుణులు. ఒకప్పటిలా యువత మరీ సాంప్రదాయాలు, కట్టుబాట్లు వంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా వరకు తగ్గింది. వచ్చే ఏడాది ఇది మరింత పెరగనుంది. అంటే యువత చాలా విషయాల్లో పాతతరం మాదిరిగా ట్రెడిషనల్‌గా ఉండటానికి ఇష్టపడటం లేదు. ఆధునికత పరిణామాలకు అనుగుణంగా నడచుకోవాలనుకుంటోంది. అందుకే రాబోయే సంవత్సరంలో రిలేషన్‌షిప్స్ విషయంలోనూ ఈ తరహా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ‘క్రాస్ - జనరేషన్ డేటింగ్’ ట్రెండ్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025లో కూడా ఇది కొనసాగింది. కాకపోతే 2026లో మరింత పెరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఏజ్ గ్యాప్ రిలేషన్స్, లవ్ మ్యారేజెస్, కులాంతర, మతాంతర వివాహాలు చాలా కామన్ అయిపోతాయి.

రిలేషన్ షిప్‌ - కొత్త పోకడలు

ఒక డేటింగ్ యాప్ సర్వే ప్రకారం.. 2025లోనే దాదాపు 20% పైగా జెన్ జీ (Gen Z)లు, అలాగే టైర్ 1, టైర్ 2 సిటీలలో నివసించే మిలీనియల్స్ కూడా సేమ్ ఏజ్ వారితో కాకుండా వయస్సులో తమకంటే చిన్న వారితో లేదా పెద్ద వారితో లవ్, డేటింగ్, పెళ్లి వంటి సంబంధాలు కొనగించారు. ఈ పరిస్థితి మోడర్న్ అండ్ ట్రెడీషనల్ వాల్యూస్ మిక్స్‌డ్ కల్చర్‌కు దారితీసింది. 2026లో ఇది మరింత పెరగనుంది. సంబంధాల్లో వయసు, కులం, మతం వంటి విషయాలకంటే కంఫర్ట్‌నే పరిగణనలోకి తీసుకునే పరిస్థితులు కొత్త ఏడాదిలో పెరుగుతాయి. వయస్సుతో సంబంధం లేకుండానే మెచ్యూరిటీ లెవల్‌లో సరిపోతారని భావించనంతకాలం రిలేషన్‌సిప్‌ను కొనసాగించడానికే అత్యధిక మంది మొగ్గు చూపుతారని విశ్లేషకులు అంటున్నారు.

మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం

అనవసరంగా రిస్క్ తీసుకోవడం, ప్రయోజనం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం వంటివి ఈతరం యువతకు నచ్చడం లేదు. వచ్చే ఏడాది(2026)లో ఈ ధోరణి మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అన్నింటికంటే ముందుగా, ముఖ్యంగా తమ మానసిక ఆరోగ్యానికి యువత ప్రయారిటీ ఇవ్వాలని భావిస్తుంది. అలాగే చదువు, కెరీర్, ఉద్యోగం, సంబంధాలు ఏ విషయంలో అయినా సరే నిర్మొహమాటమైన భావ వ్యక్తీకరణలో జెన్ జీలు ముందుండే చాన్స్ ఉంటుంది. లెస్ కన్వర్జేషన్స్ చుట్టూ పెరుగుతున్న యాంగ్జైటీని, సామాజిక అంచనాలకు అనుగుణంగా తాము రిస్క్ తీసుకోవడం వంటివి యంగ్ జనరేషన్ సహించే పరిస్థితి ఉండదు. అలాగే ఎమోషనల్ సపోర్ట్‌కు ప్రయారిటీ పెరుగుతుంది. ఇక డేటింగ్ యాప్స్ యూజర్లలో అయితే మూడవ వంతు మంది సెక్స్ ఒక్కటే జీవితం కాదు ఎమోషనల్ సపోర్ట్‌తో పాటు అది అవసరమని భావించే పరిస్థితి ఇప్పటికే ఉంది. ఇది కొనసాగనుంది. ఓ డేటింగ్ యాప్ రిపోర్ట్ ప్రకారం.. 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు గల స్త్రీలలో 33% మంది తమ వ్యక్తిగత, సామాజిక భావాలు, భావోద్వేగాలను షేర్ చేసుకునేందుకు సుఖవంతమైన బంధాల వైపు మొగ్గు చూపనున్నారు. ఇక సింగిల్స్ విషయానికి వస్తే ప్రేమ, పెళ్లి, సంబంధాల విషయంలో గతంలో మాదరి సంప్రదాయాలు, అంచనాలు వంటివి వదులుకునే చాన్స్ ఉంది. సరిపోని ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి బయటపడుతూ సమభావం, సమ జీవనం, సహజీవనం వంటి సంబంధాలకు ప్రయారిటీ పెరుగుతుందని, యువతరం ఆ వైపు ఆసక్తి చూపుతోందని నిపుణులు అంటున్నారు.

Next Story