స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటుందా..? ఏం జరుగుతుందో తెలుసా?

by Javid Pasha |   (  Updated:2025-06-21 10:54:22  IST  )

స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటుందా..? ఏం జరుగుతుందో తెలుసా?

స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటుందా..? ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : కొన్ని సందేహాలు మనసులో మెదులుతుంటాయి కానీ ఎవరినీ అడగలేరు. ఏమనుకుంటారోనని మొహమాట పడుతుంటారు. అలాంటి వాటిలో స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన(Urination) చేయడం కూడా ఒకటి. ప్రతీ వంద మందిలో దాదాపు 97 మంది స్నానం చేస్తున్న సమయంలో మూత్ర విసర్జన చేసే అలవాటును కలిగి ఉంటారని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అలా చేస్తే ఏమవుతుందనే సందేహాలు, అనుమానాలు కలుగుతున్నప్పటికీ బయటకు వ్యక్తం చేయలేకపోతారు చాలామంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా స్నానం చేస్తున్నప్పుడు మూత్రవిసర్జన చేయడం హానికరమైతే కాదని జర్నల్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ( Journal of Clinical Microbiology)లో పబ్లిషైన అధ్యయనం పేర్కొంటున్నది. ఎందుకంటే మూత్రం ఒక సాధారణ వ్యర్థ పదార్థం. పైగా ఇది స్టెరైల్ (క్రిమిరహితం) అయినందున, ఆరోగ్యవంతమైన వ్యక్తులు దీని వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేరు. పర్యావరణ పరంగా కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఏంటంటే.. స్నానం చేస్తున్నప్పుడు మూత్రవిసర్జన చేయడం వల్ల మళ్లీ ప్రత్యేకించి టాయిలెట్‌కు వెళ్లే అవసరం తగ్గుతుంది. దీంతో టాయిలెట్ ఫ్లష్ చేయడం కూడా తగ్గడం వల్ల నీటిని ఆదా చేయవచ్చు.

ప్రత్యేకించి టాయిలెట్ కోసం వెళ్లి మూత్ర విసర్జన చేసే సందర్భంకంటే, స్నానం చేస్తున్నప్పుడు చేయడం(Urination while bathing)వల్ల చాలామంది రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. ఇది శరీరానికి ఉపశమనాన్ని, మనసుకు అనందాన్ని కలిగిస్తుంది. అయితే స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేయడంపై కొన్ని సాంస్కృతిక, వ్యక్తిగత అభిప్రాయాలు సైతం ఉన్నాయి. మూత్ర విసర్జనను షవర్‌తో అనుసంధానం చేసే అలవాటు వ్యసనంగా మారవచ్చునని కూడా కొందరు పేర్కొంటారు. అలాగే మూత్రాశయ ఇన్ఫెక్షన్(Bladder infection) స్నానం చేస్తున్నప్పుడు పాస్ చేయడంవల్ల బ్యాక్టీరియా చర్మంపైకి రావడం వల్ల దురద వంటివి రావచ్చు. కానీ ఇది చాలా చాలా అరుదు.

* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story