ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్రెట్ స్టోరీ: మీ స్పెషల్ పర్సన్‌కు మాత్రమే కనిపించాలంటే..?

by Javid Pasha |   (  Updated:2025-12-09 08:09:25  IST  )

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో మీ స్టోరీ కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే కనిపించేలా పోస్ట్ చేయడం 100% సాధ్యమే. అందుకు రెండు చక్కటి మార్గాలున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్రెట్ స్టోరీ: మీ స్పెషల్ పర్సన్‌కు మాత్రమే కనిపించాలంటే..?
X

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు. కొందరికి ఇంది ఎంటర్టైన్మెంట్ అయితే, మరికొందరికి అవసరం. ఇంకొందరికి తమ సోషల్ కనర్జేషన్‌లో భాగం. చాలామంది ఇతరులతో, సమాజంతో, ఫాలోవర్స్‌తో కనెక్ట్ అవ్వడానికి, సామాజిక పరస్పర చర్యలకు, సందేశాలకు కూడా ఇది కీ రోల్ పోషిస్తుంది. అయితే కొన్నిసార్లు నేరుగా సంప్రదించడం సాధ్యం కాకనో, ఇష్టం లేకనో, ప్రైవసీ కారణంగానో కొందరు యూజర్లు తమ ఫాలోవర్లలో కొందరికో, సెలెక్టెడ్ పర్సన్‌కో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటారు. లేదా ఒక వ్యక్తితో మాత్రమే మనసులోని ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు వారు ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అయితే ఏం చేయాలి? తమ భావాలు స్టోరీ రూపంలో మాత్రమే డిస్‌ప్లే అవ్వాలంటే ఎలాంటి సెట్టింగ్స్ మార్చాలి? అనే సందేహాలు అనేకమందిని వెంటాడుతుంటాయి. నిపుణులు సూచించే పరిష్కారమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో మీ స్టోరీ కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే కనిపించేలా పోస్ట్ చేయడం 100% సాధ్యమే. అందుకు రెండు చక్కటి మార్గాలున్నాయి. ఒకటి క్లోజ ఫ్రెండ్స్ (Close Friends) ఫీచర్‌తో లేదా మరింత ప్రైవేట్‌గా డైరెక్ట్ మెసేజ్ (Direct Message)లో స్టోరీని షేర్ చేయడం ద్వారా చేయవచ్చు. అందుకోసం ఈ కింది విధంగా సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది.

1. క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఒక్కరినే లేదా మీరు ఎంతమందిని అనుకుంటే అంతమందినే యాడ్ చేసి పోస్ట్ చేయాలి. అందుకోసం మీ ప్రొఫైల్ మెనూలోకి వెళ్లి అక్కడి మూడు లైన్స్‌ను క్లిక్ చేయండి. తర్వాత కనిపించే లిస్ట్‌లో Close Friends లిస్టులో అందరినీ Remove చేసి, కేవలం మీరు అనుకున్న ఒక్క వ్యక్తిని లేదా కొంతమంది వ్యక్తులను మాత్రమే యాడ్ చేయండి. ఇప్పుడు స్టోరీ పోస్ట్ చేసేటప్పుడు కింద ఆకుపచ్చ(Green underneath)గా కనిపించే ‘Close Friends’ బటన్ సెలెక్ట్ చేసి పోస్ట్ చేయండి. దీంతో స్టోరీ సెలెక్టెడ్ పర్సన్స్‌కు మాత్రమే కనిపిస్తుంది.

2. నేరుగా డైరెక్ట్ మెసేజ్(DM)లో స్టోరీ షేర్ చేయడం (100% Perfect Privacy), స్టోరీ రికార్డ్ చేసిన తర్వాత → Send To కిందకు స్క్రోల్ చేస్తే ‘Share to Chat’ ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు సెలెక్ట్ చేసిన వ్యక్తికి సంబంధించిన DM చాట్ సెలెక్ట్ చేసి షేర్ చేయండి. ఇది నార్మల్ స్టోరీలా 24 గంటలు ఉంటుంది. కానీ ఆ ఒక్కడి DMలో మాత్రమే కనిపిస్తుంది. ఎవరికీ నోటిఫికేషన్ రాదు. ఎవరూ చూడలేరు. ఈ రెండవ మార్గం (DMలో షేర్ చేయడం) మొదటి దానికంటే ఎక్కువ ప్రైవేట్ & సేఫ్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే Close Friends లిస్ట్‌లో షేర్ చేస్తే అందులో ఉన్నవారంతా దానిని చూడవచ్చు. కానీ DMలో షేర్ చేస్తే 100% ఎవరికైతే షేర్ చేస్తారో వారు మాత్రమే చూస్తారు.

Next Story