మీ వాట్సాప్ సేఫేనా? స్కామర్ల నుంచి రక్షణకోసం ఇలా చేయండి!

by Javid Pasha |

టూ- స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి. ఇది మీ వాట్సాప్ అకౌంట్‌కు అదనపు 6 అంకెలను జోడిస్తుంది. హ్యాకర్లు మీ నంబర్‌ను కలిగి ఉన్నా లాగిన్ చేయలేరు.

మీ వాట్సాప్ సేఫేనా? స్కామర్ల నుంచి రక్షణకోసం ఇలా చేయండి!
X

దిశ, ఫీచర్స్ : అనుకోకుండా వాట్సాప్‌లో ఏదో లింక్ వస్తుంది? ఏమిటో చూద్దామని క్లిక్ చేస్తే అకౌంట్లో డబ్బులు మాయం. ఇలా ఎంతోమంది ప్రతిరోజూ స్కామర్లు, హ్యాకర్ల బారిన పడుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటూ వాట్సాప్ యూజర్లు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని, సెట్టింగ్‌లు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో చూద్దా పదండి.

ముఖ్యమైన భద్రతా చర్యలు:

*టూ- స్టెప్ వెరిఫికేషన్ (Two-Step Verification) ఆన్ చేయండి. ఎందుకంటే ఇది మీ వాట్సాప్ అకౌంట్‌కు అదనపు 6 అంకెలను జోడిస్తుంది. హ్యాకర్లు మీ నంబర్‌ను కలిగి ఉన్నా లాగిన్ చేయలేరు. మీరు లాగిన్ చేస్తేనే అవుతుంది. ముఖ్యంగా OTP / వెరిఫికేషన్ కోడ్ ఎవరికీ ఇవ్వకండి.

*అపరిచితుల కాల్స్‌ను సైలెంట్ చేసేయడం బెటర్. అందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Silence Unknown Callers’ ఆప్షన్‌ను ఆన్ చేయండి. అప్పుడు అపరిచితుల నుంచి వచ్చే స్పామ్ & స్కామ్ కాల్స్ ఆటోమేటిగ్గా బ్లాక్ అవుతాయి.

*ఇక ప్రైవసీ చెకప్‌కు సంబంధించి మీ ప్రొఫైల్ ఫొటో, స్టేటస్, లొకేషన్, ఎబౌట్ ఎవరు చూడాలనుకుంటున్నారో సెట్ చేసుకోండి. క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. మీ ఆసక్తిని బట్టి “Everybody” “My Contacts” లేదా “Nobody” అని మార్చేసుకోండి.

అదనపు రక్షణలు

*వాట్సాప్ (WhatsApp) ఎప్పుడూ అప్ డేటెడ్‌గా ఉంచండి.

*అవసరమైతే ఫింగర్‌ప్రింట్ లాక్/Face ID ఆన్ చేయండి

*సందేహస్పద లింకులు, పీడీఎఫ్‌లు, APK ఫైల్స్ తెరవకండి.

*పబ్లిక్ Wi-Fiలో వాట్సాప్ ఉపయోగించవద్దు.

Next Story