వేసవిలో జీర్ణ సమస్యలు తగ్గాలంటే.. మీరు పాటించాల్సిన చిట్కాలివే..!

by Javid Pasha |

మలబద్ధకాన్ని నివారించడంలో ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు మేలు చేస్తాయి. కూరగాయలు, పండ్లు, గింజల్లో ఇది లభిస్తుంది.

వేసవిలో జీర్ణ సమస్యలు తగ్గాలంటే.. మీరు పాటించాల్సిన చిట్కాలివే..!
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల అనేకమందిని వేధిస్తున్న చిన్న చిన్న అనారోగ్యాల్లో జీర్ణక్రియ సమస్య కూడా ఒకటి. ఇది ఎక్కువైనప్పుడు కడుపు నొప్పి, గ్యాస్, ఛాతీలో మంట, వికారం లేదా విరేచనలు వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో అజీర్తి, ఆహారాలు పడకపోవడం వల్ల ఎక్కువగా సంభవిస్తుంటాయి. అలాంటప్పుడు ఎవరికి వారు పాటించగలిగే సాధారణ చిట్కాలతో సమస్య నుంచి బబయటపడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో చూద్దాం.

1. పోషకాలను తీసుకోండి

సాధారణంగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటి ప్రాసెస్ చేయని ఆహారాలు తీసుకోవడంవల్ల ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు సమతుల్యంగా ఉంటాయి. పైగా ఈ ఆహారాల్లో ఫైబర్, విటమిన్లు ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బదులుగా జంక్ ఫుడ్, చక్కెరలు తగ్గించడంవల్ల గ్యాస్, హార్ట్‌ బర్న్ కడుపులో ఉబ్బరం వంటివి తగ్గుతాయి.

2. తగినంత ఫైబర్ తీసుకోండి

మలబద్ధకాన్ని నివారించడంలో ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు మేలు చేస్తాయి. కూరగాయలు, పండ్లు, గింజల్లో ఇది ఉంటుంది. ఆహారంలో భాగంగా అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండాలి. అలాగే హెల్తీ ఫ్యాట్స్ తినడం వల్ల పైత్యరసం ఉత్పత్తిని(bile production) పెంచి, ఆహారం జీర్ణం కావడంలో సహాయపడతాయి. శరీరం విటమిన్లను సరిగ్గా గ్రహించడానికి సహాయపడతాయి.

3. తగినంత నీరు తాగండి

నీరు ఆహారాన్ని కరిగించి, ఎంజైములను యాక్టివేట్ చేస్తుంది. శరీరంలో నీరు తక్కువైతే మలబద్ధకం, గ్యాస్ట్రిక్ వంటి ససమ్యలు వస్తాయి. కాబట్టి ప్రతిరోజూ సరిపడా నీరు తాగాలి. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి నీరు అవసరం. ఇది లాలాజలం, జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి, ఆహారం జీర్ణనాళం ద్వారా సులభంగా వెళ్ళేలా చేస్తుంది.

4. ఒత్తిడిని నియంత్రించండి

ఒత్తిడి జీర్ణక్రియను నెమ్మదింప చేస్తుంది. ఇది మీలో ఎక్కువైనట్లు భావిస్తే నివారించే ప్రయత్నం చేయాలి. యోగా, మెడిటేషన్, వాకింగ్, ప్రకృతి ఆస్వాదన వంటివి అందుకు సహాయపడతాయి. గట్-బ్రెయిన్ కనెక్షన్ వల్ల మనసు శాంతంగా ఉంటే ప్రేగులు కూడా బాగా పని చేస్తాయంటున్నారు నిపుణులు.

5. ఆహారాన్ని మైండ్‌ఫుల్‌‌నె‌స్‌గా తినండి

ఆహారాన్ని తింటే సరిపోదు. దాని రుచిని ఆస్వాదిస్తూ.. నెమ్మదిగా, శ్రద్ధగా తింటే ఆరోగ్యానికి మంచిది. ఇది ఒత్తిడి తగ్గించి, జీర్ణ ఎంజైములను యాక్టివేట్ చేయడంలో సహాయపడుతుంది. అయితే టీవీ, ఫోన్ చూస్తూ తినడం వల్ల ఈ విధమైన భావన ఏర్పడదు. కాబట్టి తినేటప్పుడు వాటికి దూరంగా ఉండండి. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినడం మంచిది. దీంతో సులభంగా జీర్ణమై గ్యాస్, అజీర్తి వంటివి రాకుండా ఉంటాయి.

6. వ్యాయామం చేయండి

ప్రతి రోజూ నడక, వ్యాయామం చేయడంవల్ల ప్రేగు కదలికలు మెరుగవుతాయి. రక్త ప్రసరణ పెరిగి, తిన్నది సక్రమంగా జీర్ణం అవుతుంది. అలాగే జీర్ణ సమస్యలు వచ్చినప్పుడు అందుకు గల కారణాలను గమనించండి. వాటిని నివారించండి. సమస్య తగ్గనప్పుడు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

7. జీవనశైలి మార్పులు

జీవన శైలిలో మార్పులు కూడా మీ ఆరోగ్య ప్రభావితం చేస్తాయి. అందుకే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా తినిడం జీర్ణ సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి సాయంత్రం 8 గంటలలోపు తినడం బెటర్. అలాగే గ్లుటామైన్, జింక్ వంటి పోషకాలు ప్రేగు గోడ(Intestinal wall)ను బలపరుస్తాయి. వాపును తగ్గిస్తాయి. కాబట్టి పాలు, పెరుగు, మజ్జిగ, మాంసం, గుడ్లు, పప్పుధాన్యాలు రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి.

Next Story