- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్కువసేపు ఏసీలో ఉంటున్నారా? ఈ సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త!
ఎక్కువసేపు ఏసీ రూముల్లో గడిపితే కొందరికి అలర్జీలు, చర్మం పొడిబారడం, దద్దుర్లు రావడం వంటివి జరగవచ్చు!

దిశ, ఫీచర్స్ : ఎండా కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి, ఉక్కబోతలు పెరుగుతాయి. ఉపశమనానికి చాలా మంది ఎయిర్ కండిషనర్ (ఏసీని) ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వర్క్ ప్లేస్‌లలో ఉద్యోగులైతే డ్యూటీ అయిపోయేదాకా ఏసీ రూముల్లో గడుపుతుంటారు. ఎండవేడికి తట్టుకోలేక ఇలా చేయడంలో తప్పులేదు. కానీ అందరి శరీర తత్వం ఒకే విధంగా ఉండదు. కొందరికి ఏసీ పడకపోవచ్చు లేదా ఎక్కువసేపు ఆన్‌లో ఉంటే అలర్జీలకు గురికావచ్చు. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేస్తే.. తర్వాత అదే పెద్ద ఆరోగ్య సమస్యగా మారవచ్చు అంటున్నారు నిపుణులు.
చర్మ సమస్యలు..
ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల లేదా ఏసీ పడకపోవడంవల్ల చర్మంలో మార్పులు వస్తాయి. అలర్జీలు ఉన్నవారికి చర్మం అధికంగా పొడిబారడం, దద్దుర్లు రావడం వంటివి జరగవచ్చు. కొందరికి ఎగ్జిమా వంటి సమస్యలకు దారితీయడం వల్ల చర్మం నిర్జీవంగా మారే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా కొందరికి ఆయిల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవడం, కళ్లచుట్టూ పగుళ్లు, బ్లాక్ సర్కిల్స్ ఏర్పడటం, ముఖంలో వృద్ధాప్య చాయలు వంటి లక్షణాలకు దారితీసే అవకాశం ఉంటుంది.
ఏం చేయాలి?
అధిక ఉష్ణోగ్రతల వల్ల ఓ వైపు ఏసీ వాడకుండా ఉండలేరు. ఇంకోవైపు అధికంగా వాడితే అలర్జీలు, ఇతర అనారోగ్యాలు వస్తాయి. ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఏసీ టెంపరేచర్‌ను 24 –26°C మధ్యలో ఉంచాలి. తక్కువగా అంటే.. 18–20°C మధ్య ఉంచితే గాలి పూర్తిగా పొడిబారుతుంది. కాబట్టి హానికరం కానీ ఒకే లెవెల్ చల్లదనం కోసం 24–26°C మధ్యలో ఉంచడం మంచిది. దీనివల్ల చర్మం తేమను కోల్పోకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఏసీ ఫిల్టర్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






