- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధిక బరువుతో అవస్థలా.. సులభంగా నియంత్రించే మైక్రో హాబిట్స్ ఇవిగో..!
లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, కారును కొంచెం దూరంగా పార్క్ చేయడం, దగ్గర్లోని మార్కెట్‌కు టూవీలర్‌పై కాకుండా నడిచివెళ్లడం వంటి మైక్రో హాబిట్స్ కూడా అధిక బరువు నియంత్రణలో సహాయపడతాయి.

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో అనేదిక మందిని వేధిస్తున్న జీవనశైలి సమస్యల్లో అధిక బరువు లేదా ఊబకాయం కూడా ఒకటి. దీనివల్ల అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి ప్రభావాలు అధికం అయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందుకే రోజువారీ వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారాల నియమాలతో అదుపులో ఉంచుకోవాలని సూచిస్తుంటారు. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.ప్రోటీన్‌తో ప్రారంభించండి : ప్రతీ ఉదయం భోజనంలో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం అధిక బరువను నియంత్రించడానినికి సులభమైన మార్గం. ఈ చిన్న మైక్రో హాబిట్స్ మీ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగు పరుస్తుంది. ప్రోటీన్ లభ్యత కోసం పెరుగు (Greek yogurt), గుడ్లు, కాటేజ్ చీజ్, నట్ బటర్ లేదా ప్రోటీన్ స్మూతీ వంటివి తీసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచి, ఎక్కువ సేపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఫలితంగా మధ్యాహ్నం స్నాక్స్ ఆకలి తగ్గి, రోజంతా కేలరీల నియంత్రణ ఈజీ అవుతుందని, బరువు తగ్గడానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
2. భోజనానికి ముందు నీరు తాగండి : ప్రతీ భోజనానికి 20-30 నిమిషాల ముందు 1-2 గ్లాసుల నీరు తాగడం చాలా సాధారణమైన అలవాటు. ఇది కడుపు నిండుగా ఉండేలా చేసి, అధికంగా తినకుండా నియంత్రిస్తుంది. అధ్యయనాల ప్రకారం.. ఇలా చేయడం వల్ల రోజువారీగా సుమారు 170 కేలరీల వరకు తక్కువ తీసుకుంటారు. దీంతో డైట్‌లో పెద్దగా మార్పులు లేకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు.
3. భోజనంలో వీటిని జోడించండి: “ఇది తినకూడదు” అని ఆలోచించకుండా, భోజనంలో కూరగాయలు, లీన్ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, నట్స్ వంటి పోషకాలను జోడించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల సహజంగానే తక్కువ పోషకాలు ఉన్న ఆహారాలు తగ్గిపోతాయి. ఇది మనసుకు ఒత్తిడి ఇవ్వకుండా, స్థిరంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఏర్పరుస్తుంది.
4. నడకకు ప్రయారిటీ ఇవ్వండి : మీరు పనిగట్టుకొని పరుగెత్తాల్సిన అవసరం లేదు. రోజువారీ దినచర్యల్లో చిన్న చిన్న నడక అలవాట్లు కూడా మీ అధిక బరువను కంట్రోల్లో ఉంచుతాయి. ఉదాహరణకు లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, కారును కొంచెం దూరంగా పార్క్ చేయడం, దగ్గర్లోని మార్కెట్‌కు టూవీలర్‌పై కాకుండా నడిచివెళ్లడం వంటివి రోజువారీ కదలికలను పెంచుతాయి. ఈ నాన్-ఎక్సర్‌సైజ్ యాక్టివిటీస్ అదనపు కేలరీలను బర్న్ చేయడంలో అద్భుతంగా సహాయపడి బరువును తగ్గిస్తాయి.
5. స్నాక్స్ తీసుకునే ముందు క్షణం ఆగండి : స్నాక్ తినాలనిపించినప్పుడు 10-20 సెకన్లు ఆగి, నిజంగా ఆకలి వేస్తుందా లేదా బోర్, స్ట్రెస్ వల్ల తినాలనిపిస్తోందా? ఒకసారి చెక్ చేయండి. ఇది ఎమోషనల్ ఈటింగ్‌ను తగ్గించి, అవసరం మేరకు మాత్రమే తినడానికి సహాయపడుతుంది. అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
6. ఆరోగ్యకరమైన ఆహారాలను కనిపించేలా ఉంచండి : మీరు ఇంట్లో ఉన్నప్పుడు పండ్లు, నట్స్, కట్ చేసిన కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను కంటికి కనిపించే చోట ఉంచండి. తక్కువ ఆరోగ్యకరమైనవి దాచేయండి. ఇలా చేయడం వల్ల సహజంగానే మంచి ఎంపికలు ఎక్కువగా తీసుకుంటారు. కొన్నిసార్లు ఎన్విరాన్మెంట్ మన అలవాట్లను ఎంతగా ప్రభావితం చేస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
7. నెమ్మదిగా తినండి : భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా తినడం, రుచిని ఆస్వాదిస్తూ తినడం, బాగా నమిలి తినడం వంటివి చేయండి. ఇది పూర్తి అయిన తర్వాత కడుపు నిండుగా ఉన్న సిగ్నల్స్‌ను మెదడు సకాలంలో అందుకుంటుంది. ఫలితంగా తక్కువ కేలరీలతోనే సంతృప్తి చెందవచ్చు.
8. భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి : ప్రతీ భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం బ్లడ్ షుగర్ స్పైక్స్‌ను తగ్గించి, ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది. ఇది రోజువారీ పనుల్లో భాగం చేసుకోవచ్చు. ఇది సులభమే కాదు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.
9. కేలరీలు విషయంలో జాగ్రత్త : ప్రతిరోజూ కేలరీలు అన్నీ లాగ్ చేయకుండా, కూరగాయల సర్వింగ్స్ లేదా రోజువారీ కదలికలు వంటి ఒక్క విషయాన్ని మాత్రమే ట్రాక్ చేయండి. ఇది ఒత్తిడిని తగ్గించి, అవగాహన పెంచుతుంది. చిన్న చిన్న విజయాలను గమనించడం ద్వారా మోటివేషన్ కొనసాగుతుంది. ఈ తొమ్మిది మైక్రోహాబిట్స్ రోజువారీ జీవితంలో అమలు చేయడం కూడా సులభమే. క్రమశిక్షణతో చేస్తే దీర్ఘకాలిక బరువు నియంత్రణ కూడా సాధ్యమవుతుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






