Technology : ఏఐ టెక్నాలజీ : 2035 నాటికి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటే..!

by Javid Pasha |   (  Updated:2025-12-23 09:06:01  IST  )

ఇది సైన్స్ ఫిక్షన్ కాదు కానీ.. సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు విస్తరిస్తోంది.

Technology : ఏఐ టెక్నాలజీ : 2035 నాటికి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటే..!
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (A.I) అందుబాటులోకి వచ్చాక అనేక మార్పులు సంతరించుకుంటున్నాయి. సాంకేతిక రంగంలోనే కాకుండా ఇతర అనేక రంగాల్లోనూ ఇది అద్భుతాలు క్రియేట్ చేస్తోంది. మానవులకు కంఫర్ట్‌ను అందించడమే కాకుండా, పనులను సులభతరం చేయడంలో సహాయపడుతోంది. ముఖ్యంగా2025లో ప్రపంచ వ్యాప్తంగా ఏఐ హవా నడిస్తోంది. అయితే ఈ సాంకేతిక పరిణామం ఇంతటితో ఆగదని, 2035 నాటికి మరింత సంచలనంగా మారనుందని, మరిన్ని అద్భుతమైన సాంకేతిక పరిణామాలు చోటు చేసుకుంటాయని పేర్కొంటున్నారు. అదెలాగో చూద్దాం పదండి!

1. రోజువారీ జీవితంలో భాగం : ఇది సైన్స్ ఫిక్షన్ కాదు కానీ.. సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు విస్తరిస్తోంది. ది గార్డియన్‌లో పబ్లిషైన ‘‘Being Human in 2035’ రిపోర్ట్ ప్రకారం.. భవిష్యత్తులో ఏఐ మొత్తం మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. 2025 నాటికి రోజువారీ జీవితంలో అదొక ముఖ్యమైన భాగమైపోతుంది. ప్రస్తుతం ఉన్నట్లు ఏఐ (AI) స్క్రీన్‌ల వెనుక లేదా కమాండ్‌ల కోసం వేచి ఉండదు. బదులుగా 20235 నాటికిది ఒక అదృశ్య లేయర్‌(invisible layer)గా మారుతుంది. ఎలక్ట్రిసిటీ లేదా స్పెల్-చెకర్ మాదిరి సహజమైన ఇన్విజిబుల్ ఎనర్జీ(Naturally and invisibly)గా పనిచేస్తుంది. రోజువారీ కార్యకలాపాల్లో కలిసిపోతుంది. ఉదాహరణకు స్మార్ట్ హోమ్‌లు, సిటీలలో మీ మూడ్ లేదా హెల్త్ ఆధారంగా న్యూస్, మీల్స్ లేదా షెడ్యూల్‌లను క్యూరేట్ చేస్తుంది. 61% మంది ఎక్స్‌పర్ట్‌లు ఈ మార్పును మానవ సామర్థ్యాలలో అతి పెద్ద మార్పుగా అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఏఐ హ్యూమన్ - మెషిన్ బౌండరీస్‌లను అధిగమిస్తుంది.

*ప్రయోజనాలు- సవాళ్లు : రోజుకు 75% అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లను (బుకింగ్‌లు, చోర్‌లు) హ్యాండిల్ చేసి, సంవత్సరానికి 91 రోజులు ఫ్రీ టైమ్ ఇస్తుంది. ఇది డిసిషన్-మేకింగ్, క్రియేటివిటీని అత్యంత సమర్థవంతంగా తయారు చేస్తుంది. అయితే అదే సందర్భంలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. టెక్నాలజీపైనే పూర్తిగా ఆధారపడటం వల్ల మానవుల్లో స్కిల్ అట్రోఫీ (మెమరీ, జడ్జ్‌మెంట్ కోల్పోవడం), ప్రైవసీ లాస్ అండ్ డిపెండెన్సీ పెరగే చాన్స్ ఉంటుంది. ఎలా అధితమిస్తామనే దానిని బట్టి ఫలితాలు ఉంటాయి.

2. లార్జర్ మోడల్స్ (Larger Models): 2035 నాటికి ఏఐ మోడల్స్ భారీగా అభివృద్ధి చెందుతాయి. విస్తృత డేటా ప్యాటర్న్‌ల(Broad data patterns)ను గుర్తించి, సబ్టల్ సిగ్నల్‌లను రీడ్ చేస్తాయి. ఉదాహరణకు డిజిటల్ ట్విన్స్ (Virtual version of you). అంటే మీ ప్రవర్తనను మోడల్ చేసి, ప్రిడిక్ట్ చేస్తాయి. ఇది స్పీడ్ అండ్ కంప్యూటేషన్ నుండి అంటిసిపేషన్‌కు షిఫ్ట్ చేస్తుంది.

*ప్రయోజనాలు- సవాళ్లు : పర్సనలైజ్డ్ సపోర్ట్, ఉదాహరణకు హెల్త్ మానిటరింగ్ లేదా ఎమోషనల్ సపోర్ట్‌లో ఏఐ సాంకేతికత కీ రోల్ పోషిస్తుంది. ఇక సవాళ్ల విషయానికి వస్తే బ్లాక్-బాక్స్ అల్గారిథమ్‌లు కొన్నిసార్లు నియంత్రణ కోల్పోయి డిజిటల్ బయాసెస్ పెరగవచ్చు. ఏఐ ఇంటెలిజెన్స్ మానవ ఇన్‌స్టింక్ట్ లాగా మారుతుది. క్వశ్చన్ పూర్తి కాకముందే రెస్పాండ్ అయి ఆన్సర్ ఇచ్చేస్తుంది.

3. ఆటానమస్ ఏజెంట్స్ (Autonomous Agents): ఏఐ అటానమస్ ఏజెంట్స్ స్వతంత్రంగా పనిచేస్తాయి. ఆయా పనుల్లో మానవులకంటే కూడా వీటి ప్రాధాన్యత 2035 నాటికి పెరుగుండవచ్చు అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ప్రొఫెషనల్ కన్సల్టెంట్స్ లాగా లీగల్, మెడికల్ లేదా కెరీర్ అడ్వైస్ ఇస్తాయి. హోమ్ రోబోట్స్ వివిధ పనులను హ్యాండిల్ చేస్తాయి. దీనివల్ల 2035 నాటికి బిజినెస్ ప్రాఫిటబిలిటీ 38% పెరుగుతుందని ప్రిడిక్ట్ చేయబడింది.

*ప్రయోజనాలు: ప్రో ఆక్టివ్ సపోర్ట్ లభిస్తుంది. ఉదాహరణకు మీటింగ్‌లలో స్ట్రెస్ డిటెక్ట్ చేసి అడ్వైస్ ఇవ్వడం, ఫార్మ్‌లలో రోబోట్స్ క్రాప్‌లు మానిటర్ చేయడం వంటి సౌకర్యాలు ఏఐ వల్ల అందుబాటులోకి వస్తాయి. సవాల్లకు సంబంధించి.. జాబ్ డిస్‌ప్లేస్‌మెంట్, స్కిల్ ఎరోషన్ అండ్ మానిప్యులేషన్ రిస్క్ పెరగొచ్చు.

4. రియల్-టైమ్ సెన్సర్స్ (Real-Time Sensors): అధునాతన ఏఐ మోడల్స్ 2035 నాటికి యూబిక్విటస్ సెన్సర్స్ (Wearables, IoT) బయోమెట్రిక్స్, బిహేవియర్‌లను ట్రాక్ చేసి, ప్రిడిక్టివ్ మోడల్స్ సృష్టిస్తాయి. ఉదాహరణకు స్మార్ట్ టాయిలెట్స్ డైట్ మానిటర్ చేసి, డిసీజ్ డిటెక్ట్ చేస్తాయి. డ్రోన్స్ యానిమల్ కమ్యూనికేషన్ ట్రాన్స్‌లేట్ చేస్తాయి.

*ప్రయోజనాలు- సవాళ్లు : రోగాలను త్వరగా నిర్ధారించడంలో(Early Disease Detection) సహాయడతుంది. రిసోర్స్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానెటరీ ఎంపథీ. అంటే యానిమల్ సిగ్నల్స్ డీకోడ్ చేయడంలో ఏఐ కీ రోల్ పోషిస్తుంది. సమస్యలు లేదా సవాళ్ల విషయానికి వస్తే.. ప్రైవసీ లాస్, సర్వైలెన్స్ అండ్ డేటా మిస్ యూజ్ వంటివి జరగొచ్చు.

5.యాంబియంట్ ఇంటర్‌ఫేసెస్ (Ambient Interfaces): ఏఐ యాంబియంట్ ఇంటెలిజెన్స్ (AmI) ద్వారా ఎన్విరాన్‌మెంట్‌లో ఎంబెడ్ అవుతుంది. వేరబుల్స్ (గ్లాసెస్, రింగ్స్) ఎక్స్‌ట్రా సెన్సెస్ లాగా పనిచేస్తాయి.

*ప్రయోజనాలు- సవాళ్లు : కాంటెక్ట్స్ అండర్‌స్టాండింగ్, ఉదాహరణకు ఫ్రిడ్జ్‌లో ఎగ్స్ లేకపోతే అక్కడ ఉండే ఏఐ సాంకేతికత ఆటోమేటిక్ ఆర్డర్ అండ్ డెలివరీ విషయంలో సహాయపడుతుంది. సవాళ్ల విషయానికి వస్తే ఇంటర్‌ఫేసెస్ AIని మనిషిలా మార్చుకొని రోజువారీ పనుల్లో ఉపయోగించుకోవడం వల్ల మానవుల మధ్య సంబంధాలు తగ్గుతాయి.

Next Story