నేనూ అదే అనుకుంటున్న..! క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఫీలింగ్స్ ఎందుకు సింక్ అవుతాయి?

by Javid Pasha |   (  Updated:2025-09-09 14:58:34  IST  )

ఆలోచనలు అందరూ పంచుకుంటారు. కానీ కొందరి ఆలోచనల్లో సారూప్యత కనిపిస్తుంది. ఆలోచనలు సింక్ అవుతాయి. ఎందుకో తెలుసా?

నేనూ అదే అనుకుంటున్న..! క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఫీలింగ్స్ ఎందుకు సింక్ అవుతాయి?
X

దిశ, ఫీచర్స్ : పరిచయం అనేక మందితో ఉంటుంది. కానీ కొందరితో ఎక్కువ క్లోజ్‌గా ఉంటాం. ఆలోచనలు అందరూ పంచుకుంటారు. కానీ కొందరి ఆలోచనల్లో సారూప్యత కనిపిస్తుంది. వివిధ అంశాల పట్ల అందరూ స్పందిస్తారు. కానీ కొందరి స్పందనలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఇలా స్త్రీ, పురుషులు ఎవరైనా కావచ్చు ఆయా సందర్భాల్లో, సంభాషణల్లో ‘అయ్యో నేనూ అదే అనుకుంటున్న’ అనే సిచువేషన్స్ ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఇద్దరి మధ్య ఆలోచనలు, ఆసక్తులు, అభిరుచులు, స్పందనలు, ప్రతి స్పందనలు తరచుగా సింక్ అవుతుంటాయి. ఎందుకలా జరుగుతుంది? ముఖ్యంగా క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఒకే తరహా ఆలోచనలకు దారితీసే ఆ అదృశ్య బంధం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం శాస్త్రవేత్తలు చాలా కాలంగా చేస్తున్నారు. అయితే ‘న్యూరో సైన్స్ జర్నల్’లో పబ్లిషైన ఒక రీసెంట్ స్టడీ ప్రకారం అది ఊహించిన దానికంటే చాలా తోతైనదని తేలింది.

అధ్యయనంలో భాగంగా ప్రతీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండే మొత్తం వంద మందిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. అధునాతన బ్రెయిన్ -స్కానింగ్ టెక్నాలజీని ఉపయోగించి, ఆయా సందర్భాల్లో వారు ఆలోచించేటప్పుడు, వివిధ సంఘటనలను అంచనా వేసేటప్పుడు, సమస్యలను పరిష్కరించేటప్పుడు, స్పందించేటప్పుడు అబ్జర్వ్ చేయగా, వారి మెదళ్లలో సింక్రనైజేషన్(Neural synchrony) కనిపించింది. అంటే ఈ ఒకే తరహ(synchronization)లో ఆలోచిస్తూ ఇద్దరి మెదళ్లు ఒకే విధమైన నమూనాల్లో పనిచేశాయి. ఒకరి మెదడు మరొకరి మెదడును కార్యకలాపాలను ప్రతిబింబించింది.

అలాగే పరిశోధనలో పాల్గొన్నవారు పిక్చర్స్ చూసినప్పుడు, స్టోరీస్ విన్నప్పుడు లేదా సాధారణ సంభాషణలో పాల్గొన్నప్పుడు వారి బ్రెయిన్ యాక్టివిటీస్‌ను పరిశోధకులు ఎఫ్‌ఎమ్ఆర్‌ఐ స్కానర్లతో గమనించారు. అయితే ఈ సందర్భంగా పరిచయం లేని వ్యక్తులతో పోలిస్తే, క్లోజ్ ఫ్రెండ్స్ మెదళ్లు ఎక్కువ సింక్రనై‌జేషన్‌(Synchronization)ను చూపాయి. కొన్ని సందర్భాల్లో ఒక స్నేహితుడి బ్రెయిన్ యాక్టివిటీని బట్టి(Brain activity) మరొకరి స్పందనను కూడా పరిశోధకులు అంచనా వేయగలిగారు. ఇది ‘టెలిపతి’ కాకపోయినా, ఫ్రెండ్స్ ఒకరి మాటలు లేదా సెంటెన్స్‌ను వేరొకరు పూర్తి చేయడం, ఒకరి భావోద్వేగాలను మరొకరు తక్షణమే గుర్తించడం, అర్థం చేసుకోవడం, ఒకే విధంగా ఆలోచించడం వంటివి జరిగాయి. అలాగే భావోద్వేగ సాన్నిహిత్యం (Emotional intimacy) ఎక్కువైన కొద్దీ మెదళ్లు ఒకే తీరులో పనిచేశాయి. ఈ పరిస్థితి స్నేహితుల మధ్య మానసిక సమాంతర భావనను(mental parallelism)సృష్టిస్తుంది. కాగా ఈ అధ్యయనం మానవ సంబంధాల శక్తిని(power of human relations), స్నేహ బంధం మెదడులో ఎలా లోతుగా నాటుకుపోతుందో తెలియజేసిందని పరిశోధకులు పేర్కొన్నారు.

Next Story