- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mother’s Day 2025: అమ్మకు ప్రేమతో...అమ్మకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు బెస్ట్ ఐడియాలు ఇవిగో ..!
Mother’s Day 2025: అమ్మకు అంకితం చేసిన ఈ ప్రత్యేక రోజు ప్రతి బిడ్డకు చాలా ప్రత్యేకమైంది.

దిశ, వెబ్ డెస్క్: Mother’s Day 2025: అమ్మకు అంకితం చేసిన ఈ ప్రత్యేక రోజు ప్రతి బిడ్డకు చాలా ప్రత్యేకమైంది. తల్లి ప్రేమ, త్యాగం, అంకితభావానికి తీపి గుర్తుగా ఈ ప్రత్యేకమైన రోజును నిర్వహించుకుంటాం. ఈ రోజు ప్రతి బిడ్డా తమ గుండెల్లో తల్లిపై దాగి ఉన్న ప్రేమను తమదైన శైలిలో అనుభూతి చెందేలా చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక అందమైన గిఫ్టును అమ్మకు ఇవ్వడం ద్వారా మీ అమ్మకు మీ ప్రేమను తెలియజేయాలనుకుంటున్నారా. ఈ మదర్స్ డే ప్రత్యేకమైన బహుమతుల ఐడియాలు మీ కోసం
ఇష్టమైన ఫుడ్:
ఈ మదర్స్ డేను మీ అమ్మతో ప్రత్యేకంగా జరుపుకోవాలంటే ఈ రోజు మీ అమ్మకు కిచెన్ నుంచి విరామం ఇవ్వండి ఈ రోజు మీ అమ్మకు ఇష్టమైన ఆహారాన్ని మీరే దగ్గరుండి వండి వడ్డించండి. పిల్లలు వండిన ఆహారం ఏ తల్లికైనా నచ్చుతుంది.
కాస్మోటిక్స్:
చాలా మంది మహిళలు లిప్ స్టిక్, క్రీమ్, మస్కారా, ఐలైనర్ వంటి కాస్మోటిక్స్ వాడేందుకు ఇష్టపడుతుంటారు. మీ అమ్మ కూడా ఈ రకమైన కాస్మోటిక్ వాడేందుకు ఇష్టపడితే మీరు ఆమెకు మంచి బ్రాండెడ్ కాస్మెటిక్ గిఫ్ట్ గా ఇవ్వండి.
పట్టుచీర:
ఏ తల్లికైనా పట్టుచీరలు కచ్చితంగా నచ్చుతాయి. మీరు సంపాదించిన డబ్బుతో ఆమెకు ఒక మంచి పట్టు చీరను కొనివ్వండి. మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్ అమ్మకు బాగా నచ్చుతుంది. ఈ మదర్స్ డే స్పెషల్ గా ఉండాలంటే మీ అమ్మకు ఇష్టమైన రంగు పట్టుచీరను కొనివ్వండి.
మూవీనైట్:
మీ అమ్మకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేందుకు మీరు ఆమెతో సినిమా నైట్ ప్లాన్ చేయవచ్చు. అమ్మ లేటెస్ట్ మూవీ చూడాలనుకుంటే ముందుగానే థియేటర్లలో టికెట్లు బుక్ చేసుకోండి. అమ్మకు ఇష్టమైన స్నాక్స్ మీరే ముందుగా తయారు చేసుకోంది.
మొబైల్ హోల్డర్ పర్స్:
షాపింగ్ చేసేటప్పుడు తల్లులు తరుచుగా తమ ఫోన్ను తీసుకెళ్లడం కష్టంగా మారుతుంది. మీరు మీ మదర్స్ డే రోజునవారి కోసం మొబైల్ హోల్డర్ పర్స్ ను కొనివ్వండి.






