నిద్ర, ఆహారం.. ఆరోగ్యం.. పడుకునేముందు వీటిని తింటే తిరుగులేదిక!

by Javid Pasha |

నిద్ర, ఆహారం.. ఆరోగ్యం.. పడుకునేముందు వీటిని తింటే తిరుగులేదిక!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా నిద్రలేమి, ఆహారా లోపాలే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి త్వరగా బయటపడాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే అందుకు సహాయపడే వాటిలో కొన్ని ముఖ్యమైన ఆహారాలు కూడా ఉన్నాయి. ఇవి నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో, శరీరానికి రిలాక్సేషన్ ఇవ్వడంలో కీ రోల్ పోషిస్తాయి. ముఖ్యంగా నిద్రకు ముందు వీటిని తింటే, నాణ్యమైన నిద్రతోపాటు పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.

*ద్రాక్ష : రాత్రి పడుకునే ముందు ద్రాక్ష (Grapes) తినడం వల్ల మెలటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది లోతైన నిద్ర(Deep sleep)ను ప్రోత్సహిస్తుంది. ద్రాక్షలో సహజంగానే మెలటోనిన్ ఉంటుంది. ఇది శరీరంలో నిద్ర చక్రాన్ని నియంత్రించే హార్మోన్. రాత్రి సమయంలో ద్రాక్ష తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు తగ్గి, మీరు లోతైన, ఆనందకరమైన నిద్రను అనుభవించవచ్చు.

*బొప్పాయి (Papaya): రాత్రిపూట పడుకోవడానికి ముందు బొప్పాయి తినడం జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. లోతైన నిద్రకు దోహదపడుతుంది. బొప్పాయిలో పపైన్ వంటి ఎంజైమ్‌లు ఉంటాయి కాబట్టి ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. ఈ అసౌకర్యాలు లేకపోవడం వల్ల రాత్రి నిద్రలో ఆటంకాలు తగ్గుతాయి. శరీరం సహజంగా రిలాక్సేషన్ మోడ్‌లోకి వెళ్తుంది.

*అవకాడో (Avocado): రాత్రి అవకాడో తినడం వల్ల GABA (గామా-అమినోబ్యూటిరిక్ యాసిడ్) స్థాయిలు పెరుగుతాయి. ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి, లోతైన నిద్రను ప్రోత్సహిస్తుంది. అవకాడోలో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇవి ఇవి GABA యాక్టివిటీని పెంచుతాయి. నిజానికి ఇది మెదడును ఉత్తేజ పరిచే లేదా శాంత పరిచే న్యూరోట్రాన్స్‌మిటర్. ఒత్తిడిని తగ్గించి, మనసును విశ్రాంతి స్థితిలోకి తీసుకువెళ్తుంది. తద్వారా నిద్ర సులభతరం అవుతుంది.

*స్వీట్ పొటాలో(Sweet Potato): సాయంత్రంపూట చిలగడ దుంప(మొరం గడ్డ)ను తినడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, నాణ్యమైన, నిరాటంకమైన నిద్రను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఈ స్వీట్ పొటాటోలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్(Complex carbohydrates and fiber) ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులను నివారిస్తాయి. ఈ హెచ్చుతగ్గులు రాత్రి మేల్కొనే సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి చిలకడదుంప తినడం వల్ల, నిద్ర ఎక్కువ కాలం నిరాటంకంగా కొనసాగుతుంది. Link

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story