- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Headache : ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
Headache : ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

దిశ, ఫీచర్స్ : తలనొప్పి.. ప్రస్తుతం చాలా మందిలో ఎదుర్కొనే సాధారణ సమస్య ఇది. అలసట, ఆందోళన, మానసిక ఒత్తిడి, వెదర్ పడకపోవడం వంటి సందర్భాల్లో వస్తూ ఉంటుంది. అలాగే జలుబు, జ్వరం వంటి వివిధ అనారోగ్యాలవల్ల కూడా హెడేక్ వస్తుంది. అయితే వీటితో సంబంధం లేకుండానే కొందరికి ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుంది. ఇందుకు ప్రత్యేక కారణాలు ఉండవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
*హెల్త్ ఎక్స్‌పర్ట్స్ స్రకారం ఉదయాన్నే తలనొప్పి రావడానికి నిద్రలేమి ప్రధాన సమస్యగా ఉంటోంది. ఒక్కోసారి అతినిద్రవల్ల కూడా రావచ్చు. కాబట్టి సరైన నిద్ర అలవాట్లను ఫాలో కావాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే నిద్ర ఎంతసేపు పోయామనేది కాకుండా అది పేలవమైన నిద్రనా?, నాణ్యమైన నిద్రనా అనేది కూడా ముఖ్యం. నాణ్యమైన నిద్రలేకపోయినా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో.. క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోవడం మంచిది.
*మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి వంటివి నిద్రలేమికి కారణం అవుతుంటాయి. తద్వారా ఉదయం లేవగానే తలనొప్పి వస్తూ ఉంటుంది. తరచుగా ఇలాంటి సమస్యలు తలెత్తడాన్ని ‘టెన్షన్ హెడేక్స్’ అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. స్ట్రెస్, యాంగ్జైటీ, హెడేక్ పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి తరచుగా ఈ సమస్యలు వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయవద్దు.
*నిద్ర రుగ్మతలు(Sleep disorders), ముఖ్యంగా స్లీప్ అప్నియా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వారిలో, ఉదయం లేవగానే తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వైద్య నిపుణులను సంప్రదించాలి. నివారణ చర్యలు పాటించాలి.
పరిష్కారం ఎలా?
*ఉదయం పూట వచ్చే తలనొప్పి సమస్యకు శాశ్వత పరిష్కారం నాణ్యమైన నిద్రనే అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ 6 నుంచి 7 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. అందుకు అవసరమైట్లు మీ స్లీప్ షెడ్యూల్‌ని సెట్ చేసుకోవాలి. ఇక డే అండ్ నైట్ షిఫ్ట్‌లను బట్టి కూడా క్వాలిటీ స్లీప్ కోసం ఏ సమయం కేటాయించాలో నిర్ణయించుకోవచ్చు. కనీసం 10 నుంచి 15 రోజులపాటు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం వంటివి చేయాలి. దీనివల్ల మీ శరీరం ఆరోగ్యకరమైన జీవక్రియకు అనుగుణంగా అలవాటు పడుతుంది. ఉదయంపూట వచ్చే తలనొప్పి సమస్యను నివారిస్తుంది. దీంతోపాటు మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు మానుకోవాలి. ఇక తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు ఉంటే మాత్రం వైద్య నిపుణులను సంప్రదించండి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






