- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : అజీర్తితో అవస్థలా..? ప్రోబయోటిక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాల్సిందే.. !
తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం అనేది అనేక ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి, దీర్ఘకాలంలో గుండె జబ్బులకు కారణం అవుతుంది.

దిశ, ఫీచర్స్ : తరచూ అజీర్తి సమస్యతో అవస్థలు పడుతున్నారా? కడుపులో ఉబ్బరంతో ఇబ్బందులు అనుభవిస్తున్నారా? మీరు మీ రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్రోబయోటిక్స్‌తో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో మీ సమస్యను దూరం చేసే లివింగ్ బ్యాక్టీరియా లేదా ఈస్ట్‌లు (Living bacteria or yeasts) ఉంటాయి. ఇవి ప్రేగులలో సమతుల్య మైక్రోబయామ్‌ను మనేజ్ చేయడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి.
వినడానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది. కానీ తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం అనేది అనేక ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి, దీర్ఘకాలంలో గుండె జబ్బులకు కారణం అవుతుంది. అందుకే జీర్ణ ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కడుపులో ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, అతిసారం వంటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) వంటివి ఉన్నప్పుడు ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలు తప్పక తీసుకోవాలి. అత్యవసరమైతే వైద్య నిపుణులను సంప్రదించి సప్లిమెంట్లు కూడా వాడొచ్చు. ఎందుకంటే ప్రోబయోటిక్స్‌లో లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం వంటి జాతులు ప్రేగులలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదులను అడ్డుకుంటాయి. ఫలితంగా జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఇక ప్రోబయోటిక్స్ ఏయే ఆహారాల్లో లభిస్తాయంటే.. పెరుగు, రైతా, లస్సీ, సౌర్ క్రాట్, కిమ్చి, పులియబెట్టిన పాల ఉత్పత్తులు, క్యాబేజీ, పులియబెట్టిన కూరగాయల వంటకం, పులియబెట్టిన జపనీస్ సోయాబీన్ పేస్ట్ వంటి పదార్థాల్లో ప్రోబయోటిక్స్ లభిస్తాయి.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






