- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health : ఉన్నట్లుండి మూడ్ మారిపోతోందా?.. ఈ లోపం ఉన్నట్టే!
Health : ఉన్నట్లుండి మూడ్ మారిపోతోందా?.. ఈ లోపం ఉన్నట్టే!

దిశ, ఫీచర్స్ : ఉన్నట్లుండి మూడ్ మారిపోతోందా? అలసట వేధిస్తోందా? మీ శరీరంలో పోషకాల లోపం అందుకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఐరన్, మెగ్నీషియం, పలు విటమిన్ల లోపం ఏర్పడితే ఇలా జరిగే అవకాశం ఉందంటున్నారు. అవేమోటో చూద్దామా..
*ఐరన్ : మానవ శరీరానికి అతి ముఖ్యమైన పోషకం ఐరన్. ఇది ఎక్కువగా లోపిస్తే మూడ్ స్వింగ్స్, ప్రవర్తనలో మార్పులు కనిపించవచ్చు. అయోమయం లేదా గందరగోళం వంటి వాటికి దారితీయవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాస్తవానికి హిమోగ్లోబిన్ తయారీలో శరీరానికి ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఇది లోపించినప్పుడు ఎనీమియా వంటి రక్తహీనత వ్యాధులు వస్తాయి. దీంతో శరీరంలోని అవయవాలకు బ్లడ్ సప్లయ్ సరిగ్గా జరగదు. నీరసం, తీవ్రమైన అలసట, కళ్లు, తల తిరగడం వంటివి సమస్యలు సంభవిస్తుంటాయి. ఆకు కూరలు, గుడ్లు, మాంసం వంటివి రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించచ్చు.
*మెగ్నీషియం : ఇది లోపిస్తే శరీరంలో నాడి వ్యవస్థ, కండరాలు సక్రమంగా పని చేయవు. మానసిక పరిస్థితి గాడితప్పుతుంది. దీంతో ఏమీ తోచక ఇబ్బంది పడుతుంటారు. తరచుగా ఆందోళన, ఒత్తిడి వేధిస్తాయి. తృణ ధాన్యాలు, గింజలు, పప్పులు, గుడ్లు, మాసం వంటివి తీసుకుంటూ ఉంటే ఈ లోపం నుంచి బయటపడవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.
*విటమిన్ బి 9 : విటమిన్ బి9 లేదా ఫోలేట్ లోపం ఉన్నట్లయితే అయోమయంగా, ఆందోళనగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది కొత్త కణాల నిర్మాణానికి ఆటకం కల్పిస్తుంది. ఫలితంగా నిరాశ, నిస్పృహ, అలసట, ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏకాగ్రత లోపిస్తుంది. సడెన్‌గా మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. బయటపడాలంటే ఆకుకూరలు, పండ్లు, తృణ ధాన్యాలు వంటి ఫోలేట్ పరిమాణం అధికంగా ఉండే ఆహారాలను తరచుగా తింటూ ఉండాలంటున్నారు నిపుణులు.
*విటమిన్ డి : డి విటమిన్ శరీరానికి చాలా ముఖ్యం. ఉదయం పూట సూర్య రశ్మికి గురికావడంవల్ల ఇది సహజంగానే లభిస్తుంది. ఎప్పుడైతే ఇది లోపిస్తుందో అప్పుడు అధిక అలసట, అయోమయం వంటివి సంభవిస్తుంటాయి. శరీరంలో కాల్షియం సరిగ్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు డి విటమిన్ లోపించినా అది కవర్ చేస్తుంది. ఈ రెండూ లోపిస్తే మాత్రం మానసిక, శారీరక సమస్యలు ఏర్పడుతుంటాయని నిపుణులు అంటున్నారు. అట్లనే కండరాలు, ఎముకల బలహీనత ఏర్పడుతుంది. అలాంటి సమస్య రాకూడదంటే.. ప్రతి రోజూ ఉదయం పూట కాసేపు ఎండలో నిలబడాలి. ఇలా చేస్తే విటమిన్ డిని శరీరం సహజంగానే పొందుతుంది. దీంతోపాటు ఫ్యాటీ ఫిషెస్, గుడ్లు, వంటివి తినాలి.
* విటమిన్ బి12 : శరీరానికి ముఖ్యమైన విటమిన్లలో ఇదొకటి. ఇది లోపిస్తే నరాల బలహీనత, నీరసం, అలసట, తలనొప్పి వేధిస్తాయనిర ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మానసిక పరిస్థితిలోనూ మార్పులు రావచ్చు. ఇది రక్తనాళాలను, కణాలను ఉత్తేజ పరుస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండటంలో కీ రోల్ పోషిస్తుంది. అయితే ఈ విటమిన్ లోపాన్ని అధిగమించడానికి తరచుగా పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, బీన్స్ వంటివి ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






