Thyroid : థైరాయిడ్ బాధితులు పాలు తాగితే బరువు పెరుగుతారా?

by Javid Pasha |

Thyroid : థైరాయిడ్ బాధితులు పాలు తాగితే బరువు పెరుగుతారా?

Thyroid : థైరాయిడ్ బాధితులు పాలు తాగితే బరువు పెరుగుతారా?
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల థైరాయిడ్ సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు ఎక్కువగా మహిళల్లోనే కనిపించేది. కానీ జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా పురుషుల్లోనూ పెరుగుతోంది. అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నవారు పాలు తాగితే అధిక బరువు పెరుగుతారని, అలర్జీలు వస్తాయని కొందరు నమ్ముతుంటారు. కానీ ఇందులో వాస్తవం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలు సంపూర్ణ ఆహారంలో భాగం కాబట్టి ఎవరైనా తాగవచ్చునని సూచిస్తున్నారు.

*నిజానికి థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సరిగ్గా ఉత్పత్తి చేయకపోవడం లేదా అధికంగా ఉత్పత్తి చేయడంవల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. దీనికి వైద్యులు తగిన మందులు, చికిత్స వంటివి సూచిస్తుంటారు. అయితే థైరాయిడ్‌ బాధితుల్లో కొందరు అధిక బరువు పెరగడం లేదా బరువు తగ్గడం వంటి సమస్యను ఎదుర్కొంటుంటారు. మరికొందరు బాధితుల్లో మూడ్ స్వింగ్స్, జట్టు రాలడం, తరచుగా అలసట వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. కాగా థైరాయిడ్‌లోనూ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని రెండు రకాలు ఉంటాయి. హైపో థైరాయిడిజం కారణంగా బరువు పెరుగుతారు. హైపర్ థైరాయిడిజంవల్ల బరువు తగ్గుతుంటారని నిపుణులు చెబుతున్నారు.

*కాగా పాలు తాగితే థైరాయిడ్ సమస్య అధికం అవుతుందని కొందరు నమ్ముతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. పైగా పాలలో అయోడిన్ అధికంగా ఉంటుంది. కాబట్టి తాగడంవల్ల థైరాయిడ్ గ్రంథిని యాక్టివ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అట్లనే పాలు, పాల ఉత్పత్తులలో విటమిన్ డి ఉండటంవల్ల థైరాయిడ్ పనితీరును బ్యాలెన్స్ చేయడంలో కీ రోల్ పోషిస్తుంది. టీఎస్‌హెచ్ లెవెల్స్‌ను సరిచేస్తుంది. కాబట్టి పాలు తాగడానికి, పాల ఉత్పత్తులను ఆహారంలో భాగంగా తీసుకోవడానికి థైరాయిడ్ బాధితులు వెనుకాడాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తు్న్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story