- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health Tips : టూత్ బ్రష్‌లను వాష్ రూముల్లో పెడుతున్నారా? ఈ ముప్పు పొంచి ఉన్నట్టే!
Health Tips : టూత్ బ్రష్‌లను వాష్ రూముల్లో పెడుతున్నారా? ఈ ముప్పు పొంచి ఉన్నట్టే!

దిశ, ఫీచర్స్ : మనం ప్రతి రోజూ ఉదయం లేవగానే తప్పకుండా చేసే పనుల్లో బ్రష్ చేయడం ఒకటి. వ్యక్తిగత పరిశుభ్రతకు, ఆరోగ్యానికి ఇది తప్పనిసరి. అయితే చాలా మంది టూత్ బ్రష్‌లను, టూత్ పేస్ట్‌ను వాష్ రూమ్ లోపల వార్డ్ రోబ్‌లోనో, హ్యాంగర్లు, షెల్ఫ్‌ల లోనో ఉంచుతుంటారు. మరికొందరు వాష్ రూమ్‌కు దగ్గరలోనే బయట ఉండే షెల్ఫ్‌లో ఉంచుతుంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వాటిపై రోగకారక బ్యాక్టీరియాలు, శిలీంద్రాలు పేరుకుపోయి ఇన్ ఫెక్షన్లకు, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయని చెబుతన్నారు.
ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం కూడా టూత్ బ్రష్‌లు వాష్ రూముల్లో ఉంచడం వల్ల పలు అనారోగ్యాలకు దారితీస్తున్నట్లు తేలింది. గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బందులు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, స్కిన్ అలెర్జీలు, నాలుకపై దద్దుర్లు, టైఫాయిడ్ వంటి రోగాలకు ఇది కారణం అవుతున్నది. అంతేకాకుండా వాష్ రూముల్లో ఫ్లష్ చేసిన ప్రతీసారి కమోడ్ నుంచి వచ్చే నీటి తుంపర్లు టూత్ బ్రష్‌లపై ఎగిరి పడుతుంటాయని, వీటిలోని ప్రమాదక బ్యాక్టీరియాలు టైఫాయిడ్, గొంతు నొప్పి, స్కిన్ అలెర్జీలతో సహా పలు ఇతర అనారోగ్యాలను కలిగించే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టూత్ బ్రష్‌లను వాష్ రూమ్‌లో పెట్టవద్దని, దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరింబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






