- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మునగతో మాతృత్వపు ఆనందం.. చనుబాల ఉత్పత్తిని 3 రెట్లు పెంచే అద్భుత పరిష్కారం
మునగ ఆకుల్లో, కాడల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి తల్లిపాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

దిశ, ఫీచర్స్ : ఇటీవల చాలామంది బాలింతలు ఎదుర్కొంటున్న సమస్యల్లో బిడ్డకు సరిపడా చనుబాలు ఉత్పత్తి కాకపోవడం కూడా ఒకటిగా ఉంటోంది. గర్భవతిగా ఉన్నప్పుడు తగిన పౌష్టికాహారం తీసుకోకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, పలు శారీరక అనారోగ్యాలు ఇందుకు కారణం అవుతుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే వీటన్నింటికీ సహజ సిద్ధమైన ఒక చక్కటి పరిష్కారం ఉంది. ఏంటంటే.. మునగ ఆకులను, కాడలను ఆహారంగా వాడటమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి చిన్న పిల్లల తల్లుల్లో బిడ్డకు సరిపడా పాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.
*ప్రముఖ బయోమెడికల్ అండ్ లైఫ్ సైన్సెస్ జర్నల్(PubMed/PMC)లో పబ్లిషైన ఒక క్లినికల్ రీసెర్చ్ ప్రకారం కూడా మునగను ఆహారంగా(Moringa) తీసుకున్న తల్లుల్లో చనుబాల(breast milk) ఉత్పత్తిలో పెరిగినట్లు వెల్లడైంది. పరిశోధనలో భాగంగా మునగను ఒక సప్లిమెంట్ మాదిరిగా బాలింతలకు ఇచ్చినప్పుడు కేవలం ఐదవ రోజు నాటికి వారిలో బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగింది.
*మునగ (మోరింగా) ఆకుల్లో, కాడల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి తల్లిపాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి బాలింతలు వాటిని ఆహారంగా తీసుకోవడం మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. మునగ ఆకుల్లో బయోయాక్టివ్ ప్లాంట్ కాంపౌండ్స్ ఉంటాయి. కాబట్టి తల్లి పాల ఉత్పత్తికి బాధ్యత వహించే హార్మోన్ అయిన ప్రొలాక్టిన్ స్థాయిలను పెంచుతుంది. చనుబాల నాణ్యత, పరిమాణాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి గర్భవతులు, బాలింతలు ఏదో ఒక రూపంలో మునగను ఆహారంగా ఉపయోగించడం వారిలో చనుబాల ఉత్పత్తిని పెంచడం ద్వారా మాతృత్వపు ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link






