- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health : వాటితో క్యాన్సర్ రిస్క్..! నివారణ కోసం ఏ ఆహారాలు తీసుకోవాలంటే..
Health : వాటితో క్యాన్సర్ రిస్క్..! నివారణ కోసం ఏ ఆహారాలు తీసుకోవాలంటే..

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్.. మన దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని వేధిస్తు్న్న ఆరోగ్య సమస్యల్లో ఇదొకటి. ఇది వాసరత్వంగా లేదా చెడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా వచ్చే రిస్క్ ఎక్కువే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన, రసాయనాలు కలిసిన ఆహారాలు తీసుకోవడం అందుకు దారితీస్తుంది. అయితే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు? ఎలాంటివి తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
క్యాన్సర్ రిస్క్‌ను పెంచే ఆహారాలు
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బయట అమ్మే ఆహారాలు ఎక్కువగా కలుషితం అవుతుంటాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు వంటివి ఇటీవల చాలామంది ఇష్టపడుతున్నారు. ఇవే కాకుండా పిజ్జా, బర్గర్, హాట్ డాగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటి హైప్రాసెసింగ్ ఫుడ్స్ అన్నీ తరచుగా తినడం క్యాన్సర్ రిస్కును పెంచుతాయంటున్నారు నిపుణులు. వీటితోపాటు అధిక చక్కెరలు కలిగిన ఆహారాలు, స్వీట్లు, అధిక మద్యపాన సేవనం వంటివి కూడా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరగడానికి కారణం అవుతాయి. పరోక్షంగా క్యాన్సర్ రిస్కును పెంచుతాయి.
క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించే ఆహారాలు
*తరచుగా తాజా ఆహారాలను, ముఖ్యంగా ఇంట్లో తయారు చేసినవి తీసుకోవడం క్యాన్సర్ రిస్కును తగ్గిస్తాయి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. డైలీ మూడు వేర్వేరు రంగుల్లో ఉన్న పండ్లను, కూరగాయలను తినడం వల్ల లభించే పోషకాలు క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. బ్రౌన్ రైస్, మొక్కజొన్న, కిడ్నీ బీన్స్, ఓట్స్ వంటివి కూడా క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహారాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.
*చేపలు, చికెన్ వంటి వాటిలో లీన్ ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి. వీటితోపాటు ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే ఆహారాలు తీసుకోవాలి. అలాగే తాజా కూరగాయలు, పండ్లు కూడా క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. ముఖ్యంగా క్యాబేజీ, బ్రోకలి, కాలీ ఫ్లవర్ వంటివి సల్ఫొరోఫెన్ సమ్మేళనాన్ని కలిగి ఉండటంవల్ల క్యాన్సర్ నివారణగా పనిచేస్తాయి.
*యాపిల్స్, బ్లూ బెర్రీస్ వంటి పండ్లు, చిక్కుళ్లు, తృణ ధాన్యాలు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి కణాల నష్టానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించడం వల్ల క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. అవిసె గింజల్లో ఫైబర్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. వీటితోపాటు అరటిపండ్లు, కోడిగుడ్లు, బీన్స్, జీడిపప్పు, నట్స్, సాల్మన్ చేపలు వంటివి క్యాన్సర్ బారిన పడకుండా సహాయపడతాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






