హైదరాబాద్‌లో అందాల పోటీలు... మిస్ వరల్డ్ కిరీటం దక్కాలంటే వారితో పడుకోవాల్సిందే... సంచలనం రేపుతున్న వీడియో..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-18 12:17:41  IST  )

భాగ్యనగరం మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమైంది. అందగత్తెలు తెలంగాణ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటున్నారు. రీసెంట్‌గా డీజే పాటలకు కూడా స్టెప్స్ వేసి వావ్ అనిపించారు. ఇలాంటి టైమ్‌లో మిస్ వరల్డ్ కిరీటం దక్కాలంటే పడుకోవాల్సిందే అనే

హైదరాబాద్‌లో అందాల పోటీలు... మిస్ వరల్డ్ కిరీటం దక్కాలంటే వారితో పడుకోవాల్సిందే... సంచలనం రేపుతున్న వీడియో..
X

దిశ, ఫీచర్స్ : భాగ్యనగరం మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమైంది. అందగత్తెలు తెలంగాణ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటున్నారు. రీసెంట్‌గా డీజే పాటలకు కూడా స్టెప్స్ వేసి వావ్ అనిపించారు. ఇలాంటి టైమ్‌లో మిస్ వరల్డ్ కిరీటం దక్కాలంటే పడుకోవాల్సిందే అనే ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఓ పాడ్ కాస్ట్‌లో ఇందుకు సంబంధించిన డిస్కషన్ జరగ్గా.. ఓవర్ ది సర్ఫేస్ అంతా బాగానే ఉన్నా లోపల మాత్రం ఇదే జరుగుతుందని చెప్పుకొచ్చింది ఓ అమ్మాయి.

యాక్టింగ్ ఇండస్ట్రీ, బ్యూటీ పీజెంట్ కాంపిటీషన్స్‌లో ముఖ్యంగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్ పోటీల్లో జరుగుతున్న విషయాలను చెప్పుకొచ్చింది. ఒక్కసారి ఫ్రాంచైజ్ దక్కిందంటే బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. ఆడిషన్ స్టార్ట్ అయిందని అమ్మాయిలను ఆహ్వానిస్తారు.. అందరూ రావొచ్చని.. పాల్గొనచ్చని.. ఓ క్రైటీరియా సెట్ చేస్తరు. దాన్ని క్రాస్ చేశారంటే మీరు కాంపిటీషన్‌కు అర్హత పొందినట్లే. కొన్ని కాంపిటీషన్స్‌లో డబ్బులు కూడా తీసుకుంటారు. కానీ కొన్నింటిలో మాత్రం పైసలు కాకుండా మిగిలిన అన్నీ తీసుకుంటారు.

ఓ 18ఏళ్ల అమ్మాయి కాంపిటీషన్‌లో పాల్గొంటుందని అనుకుందాం. మిడిల్ క్లాస్ లేదా బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఆమె మూడు లక్షల అవుట్‌ఫిట్ అఫోర్డ్ చేయలేదు కాబట్టి బ్రాండ్స్‌ను అప్రోచ్ అయితే వాళ్లు ఓకే అనొచ్చు.. ఇదంతా పైకి తెలిసిన ఫార్మాట్. కానీ లోపల మాత్రం దారుణాలు జరుగతాయి. గెలవాలంటే పడుకోవాలి.. టైటిల్ గెలవాలంటే కాళ్లు చాచాలి అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఇవన్నీ లూజర్ మాటలు అనిపిస్తుందని అంటున్నారు కొందరు జనాలు. కానీ ఇంకొందరు మాత్రం రియాలిటీ ఇదేనని కామెంట్ చేస్తున్నారు.

Click For Tweet..

Next Story