- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral: ఇలాంటి టెన్షన్ టైమ్‌లో కొందరి ఓవరాక్షన్ ఎక్కువైంది.. పాక్ నటికి వాటర్ బాటిల్ పంపిన ఫ్యాన్స్?
Viral: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: Viral: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పాక్ నటి హనియా అమీర్ కు భారత అభిమానులు వాటర్ బాటిల్లు పంపినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తుంది. ఉగ్రదాడితో భారత్ లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని ఎగదోసే పాక్ నడ్డివిరిచేలా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగా సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో హనియాకు వాటర్ బాటిల్లు పంపిన వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
హనియా పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ నటి. ఆమెకు భారత్ లోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. భారత్ కు చెందిన ప్రముఖ గాయకుడు నటుడు దిల్జిత్ దోసాంజ్ తో కలిసి సర్దార్ -3లో హనియా నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. అయితే పహల్గాం దాడితో అది సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ఈ తరుణంలో భారత్ లోని ఆమె అభిమానులు ఒక బాక్స్ నిండా నింపిన బాటిల్లను పంపారంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొందరు యువకులు ఆ కార్టన్ ను ప్యాక్ చేస్తున్నట్లుగా కనిపించింది. భారత్ నుంచి హనియాకు అనే మెసేజ్ దర్శనమిచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.






