- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెంట్‌కు నానమ్మ, తాతయ్యలు.. రాష్ట్రంలో వెలుగులోకి కొత్త బిజినెస్
జపాన్‌లో ఎమోషనల్ సపోర్ట్ కోసం మనుషులను రెంట్‌కు తీసుకుంటారు. ఒక్కో రోజుకు ఇంత ఎమౌంట్ అంటూ మనీ పే చేస్తారు. అక్క, తమ్ముడు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, అమ్మ, నాన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య.. ఇలా ప్రతీ క్యారెక్టర్‌ను ఫుల్ ఫిల్ చేసుకునే అవకాశాలు కల్పిస్తాయి

దిశ, వెబ్ డెస్క్ : జపాన్‌లో ఎమోషనల్ సపోర్ట్ కోసం మనుషులను రెంట్‌కు తీసుకుంటారు. ఒక్కో రోజుకు ఇంత ఎమౌంట్ అంటూ మనీ పే చేస్తారు. అక్క, తమ్ముడు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, అమ్మ, నాన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య.. ఇలా ప్రతీ క్యారెక్టర్‌ను ఫుల్ ఫిల్ చేసుకునే అవకాశాలు కల్పిస్తాయి అక్కడి ఏజెన్సీలు. అయితే ఈ ట్రెండ్ ఇండియాలోనూ స్టార్ట్ అయింది. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమ్ ఈ ఆఫర్ అందిస్తుండగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం దంపతులు తల్లిదండ్రులకు దూరంగా వచ్చి సెటిల్ అవుతున్నారు. ఇద్దరు జాబ్ చేస్తూ సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో పుట్టిన పిల్లలకు టైమ్ ఇవ్వలేకపోతున్నారు. నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు ఉంటే పిల్లలు వారితో స్పెండ్ చేసేవారు. టీవీలు, మొబైల్స్‌కు పరిమితం కాకుండా.. హాయిగా గ్రాండ్ పేరెంట్స్ చెప్పే స్టోరీస్ వింటూ వారితో విలువైన సమయాన్ని గడిపేవారు. కానీ చాలా మంది పిల్లలకు ఈ ఆప్షన్ లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే సరికొత్త థాట్‌తో వచ్చింది ఆశ్రమం. గ్రాండ్ పేరెంట్స్ ప్రేమను పొందాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. మీ పిల్లలకు నానమ్మ, తాతయ్యలు కావాలనుకుంటే.. మా ఆశ్రమానికి వచ్చి తీసుకెళ్లండి.. నెలకు జస్ట్ రూ. 11వేలు చెల్లిస్తే చాలని ప్రకటించింది. ఇందులో సగం సదరు నానమ్మ, తాతయ్యకు వెళ్తే.. మిగిలిన సగం ఆశ్రమానికి వెళ్తాయని తెలిపింది.
ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జీవితంలో చివరి రోజుల్లో అనాథాశ్రమాల్లో మగ్గుతున్న వృద్ధులకు ఈ విధంగా మంచి జీవితం లభిస్తుందని అంటున్నారు. బ్రిలియంట్ ఐడియా అంటూ పొగిడేస్తూ.. దీనివల్ల ఇరువైపుల బెనిఫిట్స్ కలుగుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






