గూగుల్ డ్రైవ్‌లో కొత్త ఫీచర్.. ఇక ప్రతీ సందర్భంలో అలా చేయాల్సిన అవసరం లేదు!

by Javid Pasha |

ఏఐ-పవర్డ్ ఆటోమేటిక్ మల్టీ -పేజీ స్కానింగ్’ ఫీచర్‌తో డాక్యుమెంట్ స్కానింగ్ దాదాపు ఆటోమేటిక్‌గా మారిపోయింది.

గూగుల్ డ్రైవ్‌లో కొత్త ఫీచర్.. ఇక ప్రతీ సందర్భంలో అలా చేయాల్సిన అవసరం లేదు!
X

దిశ, ఫీచర్స్ : గూగుల్ డ్రైవ్ యాప్‌ యూజర్లు అయితే గనుక మీకో గుడ్ న్యూస్. ఏంటంటే.. రీసెంట్‌గా ఇందులో ‘ఏఐ-పవర్డ్ ఆటోమేటిక్ మల్టీ-పేజీ స్కానింగ్’ అనే ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో డాక్యుమెంట్ స్కానింగ్ దాదాపు ఆటోమేటిక్‌గా మారిపోయింది. ఇక నుంచి ప్రతీపేజీకి ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఫోన్ కెమెరాను పేపర్ల మీద పట్టుకుని కేవలం పేజీలను ఫ్లిప్ చేస్తే స్వయంచాలకంగా క్యాప్చర్ చేసి, పూర్తి డాక్యుమెంట్‌ను ఒక పీడీఎఫ్‌గా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం!

ఆటోమేటిక్ మల్టీ-పేజీ స్కానింగ్ ఫీచర్ ఒకే పేజీని రెండుసార్లు స్కాన్ చేయకుండా సహజంగానే డూప్లికేట్ పేజీలను గుర్తించి వదిలేస్తుంది. డాక్యుమెంట్ స్కానింగ్ సందర్భంగా ఎడ్జెస్ డిటెక్ట్ చేసి క్రాప్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఇమేజ్ క్లారిటీని కూడా మెరుగు పరుస్తుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. 2025 సెప్టెంబర్‌లో వర్క్ స్పేస్ ల్యాబ్‌లో టెస్టింగ్ జరిగిన ఈ ఫీచర్ ఈ ఏడాది మార్చి నుంచి సాధారణ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. మల్టీ-పేజీ రియల్ టైమ్ స్కానింగ్‌కు సపోర్ట్ చేయడంతోపాటు పెద్ద డాక్యుమెంట్లు, నోట్స్, రసీదులు లేదా బుక్స్ స్కాన్ చేయడం కూడా దీనితో కేవలం సెకన్లలో జరుగుతుంది. ఆటో క్యాప్చర్, డూప్లికేట్ డిటెక్షన్, ఇన్‌స్టంట్ ఆర్గనైజేషన్ వంటి ఫీచర్లతో యూజర్ అనుభవం చాలా సులభం అయింది కూడా. ‘ఆండ్రాయిడ్&ఐవోఎస్’ రెండింటిలోనూ ఇది అందుబాటులో ఉంది. ఒకప్పుడు వేర్వేరు యాప్‌లతో అయ్యే పనులు ఇప్పుడు కేవలం గూగుల్ డ్రైవ్ (Google Drive) యాప్‌లోనే ఇంటిగ్రేట్ అయ్యాయి.

Next Story