Jewellery on rent: అద్దెకు బంగారు నగలు.. నయా ట్రెండ్ ఫాలో అవుతున్న మగువలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-06 07:47:07  IST  )

బంగారం ధ‌ర‌లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం తులం బంగారం ల‌క్ష రూపాయ‌ల పైనే ఉంది. దీంతో అంత ఖ‌ర్చు చేసి కొన‌లేక‌, కోరిక‌ను చంపుకోలేక మ‌హిళ‌లు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే కొత్త ట్రెండ్ తెర‌పైకి వ‌చ్చింది.

Jewellery on rent: అద్దెకు బంగారు నగలు.. నయా ట్రెండ్ ఫాలో అవుతున్న మగువలు
X

దిశ, వెబ్ డెస్క్: బంగారం ధ‌ర‌లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం తులం బంగారం ల‌క్ష రూపాయ‌ల పైనే ఉంది. దీంతో అంత ఖ‌ర్చు చేసి కొన‌లేక‌, కోరిక‌ను చంపుకోలేక మ‌హిళ‌లు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే కొత్త ట్రెండ్ తెర‌పైకి వ‌చ్చింది. అదే అద్దె బంగారం.. విన‌డానికి కాస్త కొత్త‌గా ఉన్నా ఇప్పుడిదే ట్రెండ్ న‌డుస్తోంది. ముఖ్యంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ ట్రెండ్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. హైద‌రాబాద్, ముంబై, చెన్నై లాంటి న‌గ‌రాల్లో ఈవ్స్ 24, శ్రీ స్టార్ గోల్డ్ లాంటి సంస్థ‌లు బంగారు న‌గ‌ల‌ను అద్దెకు ఇస్తున్నాయి. అంతేకాకుండా వ‌జ్రాలు, కెంపులు, ప‌చ్చ‌లు ఉన్న బంగారు న‌గ‌ల‌ను ఇస్తున్నాయి.

కావాల్సిన‌వాళ్లు ఒక రోజు నుండి వారం రోజుల వ‌రకు అద్దె చెల్లించి వీటిని తీసుకోవ‌చ్చు. అయితే బంగారం అద్దెకు తీసుకునేట‌ప్పుడు ఏదైనా ఐడీ ప్రూఫ్ ఇవ్వ‌డంతో పాటు డిపాజిట్ డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన డ‌బ్బును బంగారం తిరిగి ఇచ్చిన వెంటనే తీసుకోవ‌చ్చు. పెళ్లిళ్లు, బ‌ర్త్ డే పార్టీలు, ఫంక్ష‌న్లు ఇలా అకేష‌న్ ఏదైనా బంగారం కావాలంటే ఆలోచించ‌కుండా తీసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల ఒకేర‌క‌మైన న‌గలు కాకుండా న‌చ్చిన వెరైటీల‌ను వేసుకునే అవ‌కాశం ఉంటుంది. అంతేకాకుండా కొనాలంటే ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాలి అదే అద్దెకు తీసుకుంటే త‌క్కువ ధ‌ర‌కే న‌చ్చిన బంగారం ధ‌రించే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ఇప్పుడు ఈ ట్రెండ్ కు మ‌గువ‌లు క‌నెక్ట్ అవుతున్నారు.

Next Story