Viral Video: గోనీ సంచితో డ్రెస్సు.. ఈ అమ్మాయి ఇరగదీసిందిగా

by Vennela |

Viral Video: కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ పది మందిలో ప్రత్యేకంగా నిలుస్తుంటారు.

Viral Video: గోనీ సంచితో డ్రెస్సు.. ఈ అమ్మాయి ఇరగదీసిందిగా
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ పది మందిలో ప్రత్యేకంగా నిలుస్తుంటారు. ఇంకొందరు తమ తెలివితేటలకు మరింత పదును పెట్టి తాము ఎంచుకున్న రంగంలో దూసుకుపోతుంటారు. కొందరు వ్యాపారంలో వినూత్నమైన ఆలోచనలతో తమ వ్యాపారాన్ని మరింత డెవలప్ చేసుకోవడం చూస్తుంటాం. అయితే చాలా మంది స్టైలీష్ గా కనిపించేందుకు రకరకాల డ్రెస్సులు వేసుకుంటుంటారు. మరికొందరు అందరిలోనూ డిఫరెంట్ గా కనిపించాలని సొంతంగా బట్టలను డిజైన్ చేయించుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. గోనె సంచితో డిజైనర్ డ్రెస్ కుట్టించుకున్న అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.

ఇన్ స్టాలో పోస్టు చేసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అమ్మాయి తెలితేటలకు అందరూ ఫిదా అవుతున్నారు. చూసేందుకు మోడ్రన్ డ్రెస్సులా కనిపిస్తున్నా..దగ్గరికి వెళ్లి చూసే సరికి అసలు నిజం తెలుస్తోంది. దూరం నుంచి చూస్తే ఎంతో స్టైలీష్ గా కనిపిస్తుంది. గోనెసంచితో కుట్టించుకున్న ప్యాంట్, టాప్ కు మరింత ఫ్యాషన్ గా కనిపించేందుకు రెడ్ కలర్ ఆర్టిఫిషియల్ పువ్వులతో మరింత అందంగా డిజైన్ చేశారు. ఆమె డ్రెస్సు పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఊర్ఫీ జావెద్ ను కాపీ కొట్టావా..నువ్ ఉర్ఫీకి చెల్లెలా ఉన్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

వరల్డ్ ఫేమస్ డిజైనర్స్ కు కూడా తట్టని ఈ వెరైటీ మోడల్ డ్రెస్సులు వేసుకుని కుర్రవాళ్లను టెంప్ట్ చేస్తోందంటూ కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఓ వైపు తిట్టుకుంటూనే కుర్రవాళ్లు మాత్రం ఆమె వేసుకున్న డ్రెస్సును చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఆమె వీడియోలకు లైకులు కొడుతున్నారు.



Next Story