- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral news : ఏడ్వడంలో అమ్మాయిలదే పైచేయి..! ఏడాదికి ఎన్నిసార్లు ఏడుస్తారంటే..
Viral news : ఏడ్వడంలో అమ్మాయిలదే పైచేయి..! ఏడాదికి ఎన్నిసార్లు ఏడుస్తారంటే..

దిశ, ఫీచర్స్ : ‘బాలికలదే పైచేయి. అమ్మాయిలదే హవా’ అనే ప్రకటనలను మీరు వినే ఉంటారు. నిజానికి ఈరోజుల్లో అనేక రంగాల్లో అమ్మాయిలు అబ్బాయిలకంటే ముందంజలో ఉంటున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ న్యూస్ ప్రకారం.. ఏడ్వడంలో కూడా అమ్మాయిలే ముందుంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.
వైరల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఒక అబ్బాయి సంవత్సరానికి 9 నుంచి 16 సార్లు ఏడుస్తాడు. కానీ అమ్మాయి మాత్రం 30 నుంచి 64 సార్లు ఏడుస్తుందట. ఇక్కడ భావోద్వేగాలు, జెండర్ విషయాలను తక్కువ చేసి చూడటం కాదు కానీ.. ఈ తేడా జీవశాస్త్ర, సామాజిక నిబంధనలు, సాంస్కృతిక అంచనాల కలయికవల్ల ఏర్పడవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు.
అమ్మాయిలు ఎక్కువసార్లు ఎందుకు ఏడుస్తారు?
జీవశాస్త్రం (Biological perspective) ప్రకారం, అలాగే కొన్ని అధ్యయనాల ప్రకారం కూడాను స్త్రీలలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరోన్ అనే హార్మోన్లు ఎమోషనల్ సెన్సిటివిటీ(emotional sensitivity)ని పెంచుతాయి. ఈ పరిస్థితి వారిలో ఏడుపునకు దారితీస్తాయి. ఉదాహరణకు రుతుచక్రం, గర్భం లేదా ప్రసవానంతర కాలంలో హార్మోన్లలో హెచ్చు తగ్గులు మహిళల్లో భావోద్వేగ ప్రతిస్పందనలను ప్రభావితం చేస్తుంటాయి. ‘2008లో Hormones and Behavior’ అధ్యయనం పేర్కొన్నది. అంతేకాకుండా స్త్రీ, పురుషుల మెదళ్లలలో భావోద్వేగ నియంత్రణకు సంబంధించి తేడాలు ఉన్నాయి. స్త్రీలలో అమిగ్డాలా అండ్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్ష్ మధ్య కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది భావోద్వేగాలను తీవ్రంగా వ్యక్తీకరించడానికి దోహదపడుతుంది.
అబ్బాయిలు తక్కువగా ఎందుకు ఏడుస్తారు?
పురుషుల్లోనూ భావోద్వేగాలు ఉన్నప్పటికీ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వాటిని కొంత వరకు అణచివేస్తుంది. దీంతో వారు స్త్రీలతో పోలిస్తే ఏడాదిలో తక్కువ బావోద్వేగాలను అనుభవించడం, తక్కువసార్లు ఏడ్వడం చేస్తారు. అలాగే మగాళ్లు ఏడ్వడం అనేది అసమర్థత లేదా బలహీనతకు ప్రతిరూపంగా భావిస్తుంటారు ప్రజలు. కొన్ని సందర్భాల్లో మహిళలు ఏడ్వకపోవడాన్ని కూడా కఠినాత్మక హృదయంగల వారిగా జడ్జ్ చేయబడుతుంటారు. ఇలాంటి సామాజిక నిబంధనలు, ఒత్తిళ్లు వంటివి కూడా అబ్బాయిలలో తక్కువ ఏడుపునకు అమ్మాయిలలో ఎక్కువ ఏడ్పునకు కారణం అవుతుంటాయి.
ఏడుపొస్తే మనసారా ఏడ్చేయండి!
ఏడుపు బలహీనతకు నిదర్శనమనే అపోహలు కూడా చాలామందిలో ఉంటాయి. కానీ ఇది నిజం కాదంటున్నారు నిపుణులు. ఏడుపు, భావోద్వేగం వంటివి మానవ సహజ లక్షణాల్లో ఒకటి. స్త్రీ, పురుషుల్లో హార్మోన్లలో మార్పుల కారణంగా ఈ విషయంలో తేడాలు ఉండవచ్చు. అయితే ఏడ్వడంవల్ల అందరికీ మంచిదేనని, పలుఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏడుస్తున్నప్పుడు బాధను, భావోద్వేగాన్ని మేనేజ్ చేయడానికి సహాయపడే కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. హార్మోన్లలో మార్పుల కారణంగా అమ్మాయిలు ఎక్కువగా ఏడుస్తారు కాబట్టి వారు ఒత్తిడిని మేనేజ్ చేయడంలో సమర్థవంతంగా ఉంటారు. అబ్బాయిలు తక్కువగా ఏడ్వడంవల్ల స్ట్రెస్‌ను మేనేజ్ చేయడంలో కాస్త ఇబ్బంది పడతారు. ఏది ఏమైనా ఏడుపు వచ్చే సందర్భం ఎదురైతే బలవంగా ఆపుకోవద్దని, మనస్ఫూర్తిగా ఏడ్వాలని, అది ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.






