అక్కడి ఆడపిల్లలకు మూడుసార్లు పెళ్లి.. భర్త చనిపోయినా..

by Disha Web Desk 8 |
అక్కడి ఆడపిల్లలకు మూడుసార్లు పెళ్లి.. భర్త చనిపోయినా..
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ఒక్కసారి వివాహం జరిగిందంటే చాలు, ఆ అమ్మాయి ఇక అతనే ప్రపంచంగా బతుకుతుంది. ఒక వేళ ఏదైనా సందర్భంలో భర్త చనిపోతే, ఆ మహిళ పడే బాధ గురించి, ఎంత చెప్పినా తక్కువే. మరీ ముఖ్యంగా అలాంటి మహిళను లోకం ఏదో తప్పుచేసినట్లుగా చూస్తుంది.అయితే అలాంటి బాధనుంచి తమ అమ్మాయిలను తప్పించి, ఎప్పటికీ సుమంగళిగా ఉంచే సాంప్రదాయాన్ని పాటిస్తుంది ఓ తెగ.

నేపాల్‌లోని ఖాట్మండు‌ లోయలో నేవారీ అనే తెగ ఉంది. ఈ తెగలోని వారు, వారికి అమ్మాయి పుడితే అదృష్టంగా భావిస్తారు. అంతే కాకుండా వారు తమ ఇంటి ఆడపిల్లకు మూడుసార్లు వివాహం చేస్తారంట. ఈ ఆచారం ప్రాచీనకాలం నుంచి వస్తోందంటున్నారు అక్కడి ప్రజలు.

మూడు పెళ్లీలు.. అమ్మాయి మెచ్యూర్ కాకముందు 5-10 వయసు మధ్యలో మారేడు పండుతో మొదటి వివాహం చేస్తారంట. మారేడు పండును విష్ణుదేవుడికి ప్రతిరూపంగా భావించి బాలికకు దానితో వివాహం చేస్తారంట. రెండో వివాహం 10 నుంచి 15 ఏళ్ల మధ్యలో సూర్యుడితో జరిపిస్తారంట. ఈ వివాహానికి ముందు అమ్మాయిలను 12 రోజుల పాటు గుహలాంటి నిర్మాణం ఉన్న ప్రదేశంలో అమ్మాయిల్ని ఉంచుతారంట.

ఇక మూడో వివాహం, తమకు ఇష్టమైన వ్యక్తితో చేస్తారంట.యుక్త వయసు వచ్చాక, తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకోవచ్చునంట. ఒక వేళ భవిష్యత్తులో తమభర్త చనిపోయినా ఆ మహిళను సుమంగళిగా భావించి గౌరవిస్తారంట. దీనికి కారణం మూడు పెళ్లీలు జరగడమే.


Next Story

Most Viewed