ప్రకృతి వైపరీత్యాల్లో ‘బొద్దింక రోబో’ల సాయం..AIటెక్నాలజీతో అద్భుతాలు

by B.Srinivas |   (  Updated:2026-01-24 12:16:47  IST  )

జర్మనీకి చెందిన ‘స్వార్మ్ బయోటాక్టిక్స్’స్టార్టప్ కంపెనీ బొద్దింక రోబోలను తయారుచేస్తోంది. ఇవి యుద్ధంలో సాయం చేస్తాయట.

ప్రకృతి వైపరీత్యాల్లో ‘బొద్దింక రోబో’ల సాయం..AIటెక్నాలజీతో అద్భుతాలు
X

దిశ, ఫీచర్స్: సైన్స్ ఫిక్షన్ సినిమా తరహాలో యుద్ధంలో శత్రువులను ఎదుర్కొనేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగం మొదలుపెట్టారు. ఈ ఎక్స్‌పర్మెంట్ కోసం ఏకంగా బొద్దింకలను ఎంచుకున్నారు. ఈ మేరకు జర్మనీకి చెందిన ‘స్వార్మ్ బయోటాక్టిక్స్’స్టార్టప్ కంపెనీ బొద్దింకలను గూఢచారి రోబోలుగా (Cyborg Cockroaches) మార్చేస్తుంది. ఇవి భూమి పగుళ్లలో, ఇరుకైన గోడల మధ్య, పైపుల్లో, చెత్తలో ఇలా డ్రోన్లు వెళ్లలేని ప్రాంతాలకు సైతం ఈజీగా వెళ్లగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూలిపోయిన బిల్డింగ్స్ లోపల చిక్కుకున్న వారిని గుర్తించడానికి సాయపడనున్నాయి. అంతేకాదు అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీకేజీ వంటి ప్రదేశాల్లోనూ సమర్థవంతంగా పనిచేసేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు.

AI మైక్రో బ్యాక్‌ప్యాక్:
ఈ ప్రయోగంలో బొద్దింకలకు AI-ఆధారిత మైక్రో బ్యాక్‌ప్యాక్‌లను అమర్చుతున్నారు. ఈ బ్యాక్ ప్యాక్ పూర్తిగా బొద్దింక నాడి వ్యవస్థతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇందులో మైక్రో కెమెరాలు, మైక్రో ఫోన్లు, గ్యాస్ సెన్సార్లు, డాపర్లు, రాడార్ వంటి పరికరాలుంటాయి. బొద్దింకలకు అమర్చిన ఎలక్ట్రిక్ యాంటెన్నాల ద్వారా ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనే సిగ్నల్స్‌ను కమాండర్లు కంట్రోల్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో ఒకేసారి వందలాది బొద్దింకలను గుంపులు గుంపులుగా నిర్ధేశించిన ప్రదేశానికి పంపించనున్నారు. బొద్దింకలు టార్గెట్ చేసిన ప్లేస్‌కు వెళ్లగానే దానికి అమర్చిన కెమెరాలు, సెన్సార్లు అక్కడి పూర్తి సమాచారం అందిస్తాయి. దీని ఆధారంగా ఆపరేషన్ చేపట్టనున్నారు.

బొద్దింకలే ఎందుకు?
ఇవి భూమి మీద అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుంటాయి. మనుషుల కంటే 10 రేట్లు ఎక్కువగా హై టెంపరేచర్‌, రేడియేషన్లను తట్టుకుని నిలబడతాయి. సాధారణ రోబోలు మెట్ల మీద, గుట్టలు, బండలపై నడవలేవు. కానీ ఇవి సులభంగా వెళ్లగలవు. ఫుడ్, వాటర్ లేకపోయినా నెలరోజులపాటు బతికుంటాయి. ఎలాంటి ప్రత్యేకమైన బ్యాటరీసాయం అవసరం లేకుండానే వాటిని కంట్రోల్ చేసే పరికరం ఛార్జింగ్‌తో మూవ్ అవుతాయి. ఈ టెక్నాలజీ కొత్తగా అనిపిస్తున్నా.. యుద్ధాలు, విపత్తుల సమయంలో ఊహించని రీతిలో ఇవి రిజల్ట్స్ చూపించే ఛాన్స్ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story